‘మా’ సంక్షేమం కోసం.. మా ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారు అంటూ ప్రకటించారు ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో మా ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.. మా రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మా సమాస అసోసియేషన్ లో మంచు విష్ణు పనులకు అడ్డు రాకూడదనే తాను రాజీనామా చేశానని ఈ సందర్భంగా అన్నారు. మీకు కావాల్సిన వాళ్లను పెట్టుకుని ఉచితంగా మా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మంచు విష్ణు టీంకు ప్రకాశ్‌రాజ్ సూచించారు. విష్ణు రెండేళ్లు బాగా పనిచేయాలని సూచించారు ప్రకాష్ రాజ్..
ఇక, పోలింగ్ రోజు రౌడీయిజం జరిగిందని అన్నారు ప్రకాష్ రాజ్.. మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయి. బెనర్జీపై చేయి చేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందుకే రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. గెలిచిన విష్ణుకి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు మా ప్యానల్‌లో గెలిచిన వారందరం రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు.. మోహన్ బాబు అసభ్యకరంగా ప్రవర్తించారు.. రాత్రి ఫలితాలు వాయిదా వేసి.. మార్నింగ్ అన్నారు, సాయంత్రం అయ్యింది, పోస్టల్ బ్యాలెట్ కలపడానికి ఒక రోజు అయ్యింది, నిన్న గెలిచిన వాళ్ళు.. ఇవాళ ఒడిపోయం ఎంటి అనుకున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎవరు అడ్డు వచ్చిన విజయం మాదే అనే విష్ణు డైలాగ్ బాధ కలిగించిందన్న ఆయన.. మా మసక బారింది.. మేం ఆ టీంలో పని చేయగలమా.. అని మా సభ్యులు భావిస్తున్నారని.. మేం అక్కడ ఉండటం వల్ల సంక్షేమం ఆగిపోతుంది.. విష్ణు అభివృద్ధికి అడ్డు రాకుండా ఉండాలని… మేం రాజీనామా చేస్తున్నాం అన్నారు. మీరు.. మీకు కావల్సిన వారిని పెట్టుకుని పని చేయండి.. మిమ్మల్ని నమ్ముకుని గెలిచిన వారి సంక్షేమం జరగాలి అని గొడవలు వద్దు అని రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.. ఇక, మా రాజీనామా ఆమోదించండి.. అని విజ్ఞప్తి చేశారు.. అయితే, మంచు విష్ణు నా రాజీనామా ఆమోదించడానికి సిద్ధంగా లేనన్నారు.. అయితే, ఎన్నికల్లో బైలాస్ మార్చుతామని చెప్పారు.. తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంటుంది.. బైలాస్ మార్చమని మంచు విష్ణు హామీ ఇస్తే అప్పుడు నా రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు ప్రకాష్ రాజ్.