తెలంగాణ పలుకుబడితో పాలకులను ఉలికిపడేలా చేసిన ఘనుడు సుద్దాల హనుమంతు. తెలంగాణ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు పాట పలు హృదయాలను తట్టిలేపింది. ‘నీ బాంచన్ కాల్మొక్తా’ అనే బానిస బతుకుల చెరవిడిపించడంలోనూ సుద్దాల పాట ఈటెగా మారింది. హనుమంతు బాటలోనే పాటతో సాగుతున్నాడు ఆయన తనయుడు సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినిమా పాటలతోటలో సుద్దాల చెట్టు ‘నేను సైతం’ అంటూ గానం చేస్తోంది. అనేక చిత్రాలలో ఇప్పటికే వందలాది పాటలు రాసి, పరవశింపచేసిన సుద్దాల…