రష్యా, ఉక్రెయిన్ మధ్య యద్దం మొదలై మూడు నెలుల దాటింది. అయినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. రష్యా దాడిలో ఉక్రెయిన నగరాలు, పట్టణాలు ధ్వంసం అవుతున్నాయి. తాజాగా లక్సెంబర్గ్ చట్ట సభలను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ ప్రసంగించారు. తన దేశంలో ఐదో వంతు భూభాగాన్ని రష్యా నియంత్రిస్తోందని జెలన్ స్కీ అన్నారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాలో విలీనం అయిన క్రిమియా ద్వీపకల్పంతో పాటు రష్యాకు మద్దుతుగా నిలుస్తున్న వేర్పాటువాదుల ఆధీనంలో…