ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగులతో పోటెత్తింది. గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘనవిజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది. లక్నో ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 40, డికాక్ 61 పరుగులతో రాణించారు. వీళ్లిద్దరూ అవుటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే (5) విఫలమైనా లక్నోకు తిరుగులేకుండా పోయింది. దీనికి కారణం విండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్. అతడు 23…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (50) మెరుపు బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అతడు అవుటైనా శివమ్ దూబె (49) కూడా దూకుడుగా ఆడాడు. అయితే తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. దూబె 30…
ఐపీఎల్‌లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి…
ఐపీఎల్ ద్వారా మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ తన సత్తా చూపించాడు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అతడు రికార్డు సృష్టించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోనీ మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా 41…
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఈరోజు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే ఈ పోరు కేఎల్ రాహుల్ టీమ్‌పై హార్డిక్ పాండ్యా జట్టు విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం…
ఐపీఎల్‌లో కొత్త జట్ల సమరం ఆసక్తికరంగా సాగింది. సోమవారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో టీమ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. గుజరాత్ బౌలర్ మహ్మద్ షమీ ఈ వికెట్ సాధించాడు. షమీ విజృంభించడంతో లక్నో టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. క్వింటన్ డికాక్…
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఈరోజే తొలిసారిగా మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఆ రెండు జట్లే లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ టైటాన్స్‌కు హార్డిక్ పాండ్యా నాయకత్వం వహిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వహిస్తున్నాడు. తొలిసారిగా ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ రెండు జట్లలో విజయం…
ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉంటాడు. గతంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతడు ఈ ఏడాది కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. మరోవైపు ఇంకో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆప్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ బరిలోకి దిగుతున్నాడు. రషీద్ ఖాన్ కూడా ఐపీఎల్‌లో విజయవంతమైన బౌలరే. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఐపీఎల్‌లో ఈ రెండు కొత్త జట్లు తలపడుతున్న వేళ…
ఈ ఏడాది ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు అడుగుపెట్టబోతున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ అందులో ఒకటి. పేపర్ మీద ఈ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. మరి ప్రధాన టోర్నీలో ఎలా రాణిస్తుందో అన్న విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. రూ.7,090 కోట్లతో సంజీవ్ గోయెంకా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. రూ.17 కోట్లు ఖర్చు చేసి కేఎల్ రాహుల్‌ను మెగా వేలం కంటే ముందే తీసుకున్నారు. అంతేకాకుండా కెప్టెన్‌గానూ నియమించారు. మరోవైపు గతంలో కోల్‌కతాకు రెండుసార్లు…