ఐపీఎల్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జూలు విదిల్చింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డుప్లెసిస్ డకౌట్‌గా వెనుతిరగడం, మరో ఓపెనర్ కోహ్లీ కూడా 25 పరుగులకే వెనుతిరగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. అటు మరో స్టార్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ కూడా 9 పరుగులకే…
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. కోల్‌కతాలోని ఈడెన్ మైదానంలో చిరుజల్లులు కురుస్తుండటంతో అంపైర్లు టాస్ ప్రక్రియను వాయిదా వేశారు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు బెంగళూరు జట్టును కలవరపరుస్తోంది. 2008 నుంచి ఇప్పటి వరకు మొత్తం 14 ఐపీఎల్ సీజన్‌లు జరగ్గా.. ఆర్సీబీ ఏడు సార్లు ప్లేఆఫ్స్‌లో ఆడింది. కానీ కనీసం…
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు రెచ్చిపోయారు. 20 ఓవర్లపాటు వికెట్ పడకుండా ఆడి 210 పరుగులు చేశారు. ఓపెనర్లు డికాక్(70 బంతుల్లో 140 నాటౌట్), కేఎల్ రాహుల్(51 బంతుల్లో 68 నాటౌట్) వీర విహారం చేశారు. అంతేకాకుండా వీళ్లిద్దరూ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయిలో ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బెయిర్‌స్టో, వార్నర్ (185 పరుగులు) పేరిట ఉన్న ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్…
పూణె వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుతిరిగాడు. అయితే మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. డికాక్ 36 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో…
ఐపీఎల్‌లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ మరోసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో లక్నో టీమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. కేఎల్ రాహుల్, దీపక్ హుడా హాఫ్ సెంచరీలు చేయడంతో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 196 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ…
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77), డికాక్ (23) రాణించారు. తొలి వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం అందించారు. ముఖ్యంగా ఫామ్‌లో ఉన్న రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 77 పరుగులు చేసి తన జట్టుకు…
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రూ.12లక్షలు జరిమానా పడింది. ముంబై ఇండియన్స్‌తో శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో స్లోఓవర్ రేట్ కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో కోత పడింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబైపై లక్నో జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో సెంచరీ చేసిన రాహుల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో తాను ఆడుతున్న వందో…
ఐపీఎల్ 2022లో కొత్తగా ప్రవేశించిన లక్నోసూపర్ జెయింట్స్ టీమ్ జోరు కొనసాగుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన లక్నో.. అనంతరం బ్యాటింగ్‌లో డికాక్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో గెలుపు అందుకుంది. డికాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో…
ఐపీఎల్‌లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరు చేసింది. ఆరంభంలో అదరగొట్టిన ఆ జట్టు బ్యాటర్లు ఆ తర్వాత నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఢిల్లీ జట్టు సాధించిన స్కోరులో ఓపెనర్ పృథ్వీ షా ఒక్కడే 61 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ 39 నాటౌట్, సర్ఫరాజ్ ఖాన్ 36…
ఐపీఎల్‌లో డీవై పాటిల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన తమ జట్టును ఓపెనర్ కేఎల్ రాహుల్ (68), ఆల్‌రౌండర్ దీపక్ హుడా (51) హాఫ్ సెంచరీలతో రాణించి తమ జట్టుకు మంచి స్కోరు అందించారు. కేఎల్ రాహుల్ 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 68 పరుగులు చేశాడు. దీపక్ హుడా 33 బంతుల్లో…