ఓవైపు తగిన పిల్ల దొరకక పెళ్లికాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు.. ఏళ్ల తరబడి పెళ్లి కోసం నిరీక్షించేవాళ్లు లేకపోలేదు.. మరోవైపు, నిత్య పెళ్లి కొడుకులు.. నిత్య పెళ్లి కూతుళ్ల వ్యవహారాలు కూడ బయటపడుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఓ యువకుడి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. పట్టుమని 30 ఏళ్లు కూడా నిండడని ఓ యువకుడు.. ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు… ఎంతటి ఘనుడైనా.. ఎక్కడో ఒకదగ్గర చిక్కకపోడు కదా.. ఓ యువతి ఫిర్యాదుతో మన కేడీ…
హైదరాబాద్ కాటేదాన్‌లో అదృశ్యమైన సాయిప్రియ అనే యువతి.. చివరకు శవమై కనిపించింది… ఇంటి నుంచి వెళ్లిపోయిందనుకున్నారు.. ఎక్కడో ప్రాణాలతోనే ఉంటుంది అనుకున్నారు.. అంతేకాదు.. ఆమె మొబైల్ నుంచి.. ఆమె తండ్రికి వచ్చిన మెసేజ్‌లను బట్టి చూస్తే.. నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు కాదన్నావు.. అందుకే లేచిపోతున్నానంటూ సందేశాలు పంపారు.. దీంతో, ఆ యువతి ఎక్కడో ఉండే ఉంటుంది అనే నమ్మకంతో ఉన్నారు.. కానీ, ఆమె ప్రాణాలే తీశాడు.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడే ఆమెను దారుణంగా…
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ గత కొంతకాలంగా ఓ యువతిని వేధింపులకు గురిచేస్తున్న యువకుడు.. ఆ యువతి నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు… ఆ యువతిని ఎలాగైనా మట్టుబెట్టాలనుకున్నాడు.. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో… ఢీకొట్టాడు.. తర్వాత అది ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.. చివరకు అసలు విషయం వెలుగు చూడడంతో.. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Read Also:…
ప్రేమకు వయస్సుతో సంబంధంలేదు. ఇది మనం తరచూ వినే మాట. ప్రేమలో పడ్డవారు ఎవరి గురించి ఆలోచించరు. ప్రేమలో వున్నవారికి వారు తప్ప మరెవరు కనిపించరు. ఏంచేస్తున్నారో వారికే తెలియదు. ప్రేమలో వుంటే సినిమాలు చూసి తెగింపు వచ్చేస్తుంది. కని పెంచిన తల్లిదండ్రులకంటే ఎవరో ముక్కు మొహం తెలియని అబ్బాయి, అమ్మాయి పై ప్రేమ అంటూ వెంటబడి వారితో మన జీవితం అంటూ ఫిక్స్ అయిపోతారు. వారు జీవితంలో లేకుంటా బతకలేము అనే ఫీలింగ్ లో వెళతారు.…
సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మంజుదార్ ఆత్మహత్య మరువకముందే.. సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ ఒడియా బుల్లితెర నటి రష్మీ రేఖ ఓజా జూన్ 18 రాత్రి ఆత్యహత్యకు పాల్పడింది. భువనేశ్వర్‌లోని గదసాహీ ప్రాంతానికి సమీపంలోని నాయపల్లిలో ఉన్న తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. గత కొద్ది రోజులుగా ఈ ఇంట్లోనే రష్మీ అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సమాచారంతో పోలీసులు…
ప్రేమ అనేది రెండు అక్షరాలు. కానీ ఈ ప్రేమలో అనేక చరిత్రలు ఉన్నాయి. ఈ ప్రేమ కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు. మరొకొందరైతే ప్రాణాలు తీశారు. ఇంకొందరి ప్రేమలు మధ్యలోనే మసకబారిపోయాయి. దానికి కారణం వారి కుటుంబ సభ్యులె. పిల్లల ప్రేమను తల్లిదండ్రులు ఎవరైనా సరే చాలావరకు అంగీకరించరు. ఒకవేళ అంగీకారం తెలిపిన ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని దాటితే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది. లేదంటే మధ్యలోనే మసకబారిపోతుంది. ప్రస్తుత…
ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకీ రాజుకుంటోంది. మంత్రులు, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. అనకాపల్లిలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా ప్రేమికులు దొరుకుతారేమో అని తిరుగుతున్నారు. అందుకే అనకాపల్లి జిల్లాలో ఈ రెండు రోజుల సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. 74 ఏళ్ల చంద్రబాబునాయుడు నాది వన్ సైడ్ లవ్వు నన్ను ఎవరు ప్రేమించడం లేదని బాధ పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు…
రాష్ట్రంలో యువతులపై అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసు ఘటన మరువకముందే మరో ఉందతం వెలుగులోకి వచ్చింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి , ఆ యువతిని తనపై నమ్మకం కుదిరేలా చేసుకుని, తనపై వున్న కామవాంఛ తీర్చకున్నాడు. ఆయువతిని గర్భవతిని చేసి చేతులు దులుపుకోవాలని చూసాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అత్తాపూర్ కిషన్ బాగ్ లో జరిగింది. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి…
ప్రేమికులకు ప్రేమ అంటే అమృతం దొరికినట్లే అంటూ ఫీలతూ వుంటారు. ప్రేమలో వున్న వారికి ఏంచేస్తున్నామో .. ఏజరుగుతుందో అర్థంకాని ఆయోమయ ప్రపంచంలో వుంటారు. ప్రేమకు బానిసలై ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ప్రేమను కాదన్నారనో, బ్రేకప్ అయ్యిందనో, పెళ్లికి నిరాకరించారనో, మోసం చేశారనో లవర్స్. ప్రేయసో.. ప్రియుడో ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తరచూ చూస్తుంటాం. అయితే, ఇది దీనికి పూర్తిగా భిన్నం. ప్రేమకథల్లో ఉండాల్సిన ట్విస్టులతో పాటు..ఇందులో మరో ఊహించని ట్విస్ట్ ఉంది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ…