Tirumala : తిరుమల ఘాట్ రోడ్లలో కారు కలకలం సృష్టించింది. కారులో యువకులు పలు చెక్ పోస్టుల వద్ద ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు ఛేజ్ చేశారు. అలిపిరి భద్రతా వలయంలో కారును ఆపకుండా దూసుకెళ్లారు. దీంతో భద్రతా సిబ్బంది, విజులెన్స్ సిబ్బంది మొబైల్ వాహనంతో వెంటాడారు. దీంతో కారును ఘాట్ రోడ్డులోనే ఆపేశారు. అనంతరం అందులో ఉన్న యువకులు లోయలోకి దూకి పారిపోయినట్లుగా తెలుస్తోంది. లోయలోకి దూకిన వారెంతమందో సంఖ్య ఖచ్చితంగా తెలియడం లేదు.
Read Also: Naga Chaitanya – Samantha : సమంతను కలిసిన నాగచైతన్య.. నేనున్నానంటూ భరోసా
పోలీసులు, విజిలెన్స్ అధికారులు పారిపోయిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘాట్ రోడ్డులో వారు వదిలి వెళ్లిన కారును ఆపి తనిఖీ చేశారు. అనంతరం కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంబడించడంతో యువకులు కారును వదిలిపోవడంలో ప్రేమ వ్యవహారం, కిడ్నాప్ కారణంగా భావిస్తున్నారు. కారులో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా కారులో ఆరుగురు యువకులు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఇద్దరిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకున్న వారిని అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. రెండవ ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు వద్ద పారిపోయిన మరో ఇద్దరు యువకుల కోసం టీటీడీ విజిలెన్స్ సిబ్బంది గాలిస్తున్నారు.