Hyderabad: హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడో కామాంధుడు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మరో దుర్మార్గుడు. వారి దాష్టికానికి గర్భం దాల్చింది బాలిక. ఇటీవలే ఆమె మగబిడ్డకు జన్మ నిచ్చింది. ఇదిలా ఉండగా బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండుకు తరలించారు. పుట్టిన బిడ్డకు మూడునెలల తర్వాత డిఎన్ఏ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. వెంకటగిరిలో నివాసముంటున్న బాలిక తల్లిలో కలిసి ఇండ్లలో పనిచేస్తుంటుంది. కాగా అదే ప్రాంతంలో నివాసముంటున్న సాయికుమార్ బాలికతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. బాలిక పని చేస్తున్న ఇంటిపక్కన వాచ్ మెన్ గా పని చేస్తున్న నేపాల్ కు చెందిన బుద్దిమాన్ కామె బాలికకు మాయమాటలు చెప్పి.. మత్తు మందు కలిపిన ఆహార పదార్థాలు ఇచ్చి లోబరుచుకున్నాడు. ఇలా అనేక మార్లు తన గదికి తీసుకెళ్లి ఆమెకు మత్తు మందు ఇచ్చిన ఆహారపదార్థాలు ఇచ్చేవాడు. మత్తులోకి జారుకున్నాక తనపై లైంగిక దాడి చేసేవాడు.
Read Also: Rat Stolen: ఎలుక ఎత్తుకెళ్లారని ఫిర్యాదు.. ముగ్గురిపై కేసు నమోదు
ఇటు సాయికుమార్ సైతం ఆమెన ప్రేమ పేరుతో లోబర్చుకుని లైంగికదాడికి పాల్పడేవాడని తెలుస్తోంది. దాంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆరు నెలలు దాటిన తర్వాత ఆశ వర్కర్ బాలిక గర్భం దాల్చిన విషయాన్ని గుర్తించి సమాచారాన్ని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో వ్యవహారమంతా పోలీసుకు చేరింది. బాలిక పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వారిద్దరిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి బాలిక స్టేట్ హోంలోనే ఉంది. బాధితురాలు శనివారం మగబిడ్డను ప్రసవించింది. గర్భం దాల్చేందుకు కారకులు ఎవరనే విషయాన్ని పోలీసులు తేల్చే పనిలో ఇద్దరు నిందితులకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.