Paddy Procurement : నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు పండించిన బంగారం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయింది. ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ధాన్యం రాశులు కళ్లెదుటే క్షీణిస్తుంటే రైతుల గుండెలు మాత్రం ఆందోళనతో కొట్టుకుంటున్నాయి. దీనికి కారణం లారీల కొరత.. ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు ధాన్యం కుప్పలతో నిండిపోయాయి. రోజుల తరబడి రైతులు తమ ధాన్యంతో పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీని వెనుక అసలు కథ వేరే ఉంది..…