18వ లోక్‌సభ తొలి సమావేశాలు ఈరోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ సహా కొత్తగా ఎన్నికైన సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. సెషన్‌కు ముందు ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. సభ్యులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ప్రజాస్వామ్యానికి గర్వకారణమని అభివర్ణించారు. అంతేకాకుండా.. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం గురించి మాట్లాడారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈరోజు అద్భుతమైన రోజు అని ప్రధాని మోడీ అన్నారు.