బీజేపీ కొత్త శక్తిగా తెలంగాణలో అవతరిస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు. ఓటు వేసిన ప్రజలకు, అధికారులకు, రాజకీయపార్టీల కార్యకర్తలకు, మీడియాకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరింత బలపడేందుకు ఉపయోగపడుతుంది.. పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. బీజేపీకి సానుకూల వాతావరణ కనిపించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత 'అబ్కీ బార్, 400 పార్' నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
మండు వేసవిని చల్లటి బీరుతో ఎంజాయ్ చేయాలనుకునే మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు రెండు రోజుల డ్రైడేస్ ను ప్రకటించారు. ఫలితంగా మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. Also Read: Current Bill: కేవలం 14 యూనిట్లకు కరెంట్ వాడకానికి వేలల్లో బిల్లు.. వైరల్.. మే 11వ తేదీ శనివారం సాయంత్రం 6…
లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్‌తో పాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఓటింగ్ హక్కుల వినియోగంపై సమాచారాన్ని ప్రచారం చేయడం కొనసాగిస్తున్నాయి. దానితో, రైడ్-షేరింగ్ యాప్ ‘రాపిడో’ రాష్ట్ర ఎన్నికల అధికారులతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని ప్రకటించారు. మే 13న ఎన్నికల రోజున హైదరాబాద్‌తో సహా కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తెలంగాణలోని 17…
RJD Manifesto : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ చిన్న కుమారుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రీయ జనతాదళ్(RJD) మేనిఫెస్టోను విడుదల చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికార (బీజేపీ)పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికలపై పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదని తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తిపోతుంది. దింతో లోక్ సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వారి నియోజవర్గాలలో పెద్దపెద్ద మీటింగ్ లను ఏర్పాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లను అభ్యర్థిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. మరికొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. Also Read: Elections 2024:…
రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంపొందించేందుకు, ప్రజాస్వామ్యాన్ని అర్థవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ కోరారు. యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనత వంటి వివిధ కారణాల వల్ల వరుసగా జరిగిన ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదైందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఓటింగ్ శాతం మరింత తగ్గకుండా సీఈవోలు కృషి చేయాలని ఆయన…
TS EAPCET 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. EAPCET పరీక్షను షెడ్యూల్ కంటే ముందుగానే నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.