BRS MP Candidates: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా.. మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని తాను పోటీ చేస్తోన్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హమ్‌పోర్లో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
Swarna Sudhakar Reddy: బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.
రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. నిన్న రాహుల్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు.. అటు నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ, సీఈసీ మీటింగ్ లో పాల్గొననున్నారు.
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
Mayawati : ఎన్నికల సంఘం శనివారం దేశంలో లోక్‌సభ ఎన్నికలు 2024 తేదీలను ప్రకటించింది. దీని ప్రకారం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
హైదరాబాద్ మల్కాజ్గిరిలో పోలీస్ హై అలర్ట్ నిర్వహించారు. ప్రధాని మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోడీ విజయ సంకల్ప రోడ్ షో చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత నిర్వహించనున్నారు. మల్కాజ్గిరిలో మోడీ రోడ్ షో 1.3 కిలోమీటర్, గంట పాటు సాగనుంది. అందుకోసమని.. రెండు వేలకు పైగా10 అంచెల పోలీస్ భారీ భద్రత చేపట్టనున్నారు.