Lokesh Kanagaraj : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకుడు లోకేష్ కనగరాజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అద్భుతమైన టేకింగ్ తో సినిమాలను తెరకెక్కిస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నాడు.లోకేష్ తన సినిమాటిక్ యూనివర్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.సినిమాటిక్ యూనివర్స్ ద్వారా ఒక సినిమాకు ఇంకో సినిమాను లింక్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్లడం ప్రేక్షకులకు బాగా నచ్చింది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఖైదీ, విక్రమ్, లియో…