ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలతో పాటు.. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహించనున్నంది ఎన్నికల కమిషన్.. కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన పూర్తి కాగా.. ఈ రోజు ఇవాళ నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజు కావడంతో.. ఇంకా ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు.. కొన్నిస్థానాల్లో రెబల్స్ నామినేషన్స్ వేయడంతో.. వారి ఉపసంహరించుకుంటారా? లేదా కొనసాగుతారా? బరిలో నిలిచే స్వతంత్రులు ఎంతమంది.. వెనక్కి తగ్గేవారు ఎవరు? ఇవాళ్టితో తేలిపోనుంది.
BJP Manifesto: లోక్‌సభ ఎన్నికల కోసం రేపు బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. సంక్షేమం, అభివృద్ధి ప్రణాళికతో పాటు ‘విక్షిత్ భారత్’ రోడ్‌మ్యాప్ ఎన్నికల ఎజెండాలో ప్రముఖంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు.