2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొందరు అభ్యర్థులు జైల్లో ఉన్నప్పటికీ ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. వీరిలో ఎన్నికల ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఇద్దరు వ్యక్తులే.. జమ్మూ కాశ్మీర్‌లో మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను రెండుసార్లు ఓడించిన రషీద్ షేక్, ఖలిస్థానీ మద్దతుదారు అమృతపాల్ సింగ్.
లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఆధిక్యతతో గెలుపొందిన గత రికార్డును ఐదుగురు అభ్యర్థులు బద్దలు కొట్టారు. అందులో బీజేపీకి చెందిన అభ్యర్థులు నలుగురు ఉన్నారు. ఇండోర్ నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీ శంకర్ లాల్వానీ 11.72 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు.
లోక్‌సభ ఎన్నికల్లో చివరి దశ ఏడో విడత ఎన్నికల కోసం బీజేపీ పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తుంది. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మిర్జాపూర్, మౌ, డియోరియాలలో నిర్వహించే బహిరంగ సమావేశాల్లో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేయనున్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సాదారణ ప్రజలతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చారు.. ఇప్పటికే చాలా మంది ప్రజలతో పాటే సమన్వయం పాటిస్తూ క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. అటు ఏపీలో కూడా 25 ఎంపీ,175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఉదయం…
మల్కాజ్‌గిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు పట్నం సునీత రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికలు 2వ దశ ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు.
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు.