తెలంగాణ లోక్ సభ ఎన్నికలతో పాటుగా కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ప్రారంభం అయ్యిన విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం సాదారణ ప్రజలతో పాటుగా సినీ ప్రముఖులు కూడా ముందుకు వచ్చారు.. ఇప్పటికే చాలా మంది ప్రజలతో పాటే సమన్వయం పాటిస్తూ క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు..
అటు ఏపీలో కూడా 25 ఎంపీ,175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఉదయం ఏడు గంటల నుంచే సామాన్య ప్రజలతో పాటుగా సెలెబ్రేటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, తన భార్య, తల్లితో కలిసి జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నాడు..
అలాగే అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని బీఎస్ఏన్ఎల్ సెంటర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. అనంతరం మీడియాతో మాట్లాడాడు… అలాగే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు తమ భార్యలతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. రాజమౌళి కూడా తన భార్య, కొడుకుతో కలిసి షేక్ పేటలో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు, సందీప్ కిషన్ లు కూడా ప్రజలతో పాటు ఓటు హక్కును వినియోంచుకున్నారు..ఉమెన్ కోపేరేటివ్ డవలప్ మెంట్ కార్పొరేషన్ కేంద్రం లో అక్కినేని నాగ చైతన్య ఓటు హక్కు వినియోగించుకున్నాడు.. అదే విధంగా నందమూరి బాలకృష్ణ తన భార్యతో కలిసి హిందూపూర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నాడు..