2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశకు ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో ఎన్డీయే కూటమిలోని పార్టీల మధ్య అంతర్గత పోరు కొనసాగుతుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన తన మధ్యంతర బెయిల్ ను పొడిగించాలంటూ వేసిన పిటీషన్ ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది.
ఏడో దశ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన నరేంద్ర మోడీ.. గత 24 ఏళ్లుగా విపక్షాలు తనపై దౌర్జన్యం చేస్తున్నాయని అన్నారు. ఎన్నికలు జరిగినా, జరగకపోయినా.. ఈ వ్యక్తులు (ప్రతిపక్షాలు) దుర్వినియోగం చేసేందుకే ఇష్టపడుతారని విమర్శించారు.
నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
Amit Shah: లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి.
Nitish Kumar: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మరోసారి సమాజ్‌వాదీ(ఎస్పీ)ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సంఘంపై బురదజల్లే ప్రయత్నం చేస్తు్న్నాయి. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని.. తరచూ ఆరోపిస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన ఈసీ పలు వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఎన్నికల ప్రక్రియకు హాని కలిగించేలా తప్పుడు కథనాల వ్యాప్తి, దుర్మార్గపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈసీ ఆరోపించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నేడు ఆరో దశ పోలింగ్ ముగిసింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నిస్తోంది. కాగా.. ఒక వేళ ఇండియా కూటమికి అధిక సీట్లు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అందులో ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై దేశ వ్యప్తంగా చర్చ కొనసాగుతోంది.