Jammu & Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారి ఎన్ని లక్షల మంది ఓటు వేయనున్నారో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu And Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 3. 4 లక్షల మంది తొలిసారిగా ఓటు వేయనున్నారని ఎన్నికల కమిషన్ తెలిపింది. అలాగే, మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు అర్హులని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున 747 మంది ఓటర్లు ఉండేలా 11,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇందులో 77,290 మంది 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉండగా అందులో 2,886 మంది 100 ఏళ్లకు పైబడిన వారున్నారు.
Read Also: Tiger attack: పెద్ద పులి దాడి చేసినా బెదరలేదు, ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడంటే..
Also Read
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- Quantum Valley Twin Towers: అమరావతిలో మరో భారీ ప్రాజెక్ట్.. 25 వేల మందికి ఉద్యోగాలు..!
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
ఇక, ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు జమ్మూ కాశ్మీర్‌లో మూడు రోజుల సుదీర్ఘ పర్యటన ముగింపు సందర్భంగా ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.. జమ్ము అండ్ కాశ్మీర్ లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ఉత్సాహంగా పాల్గొనాలని ఓటర్లను, రాజకీయ పార్టీలను ఆయన అభ్యర్థించారు. మేము ఎన్నికల సంసిద్ధతను సమీక్షించడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తున్నాము.. ఇదే మా చివరి పర్యటన అని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Paytm : పేటీఎం మాస్టర్ ప్లాన్.. తన పార్టనర్ గా రంగంలోకి ఎస్బీఐ
అయితే, శాంతియుతంగా, ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని.. ఓటర్లు గరిష్ఠంగా ఓటింగ్ జరిగేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో 44. 34 లక్షల మంది పురుషులు ఉండగా.. 42. 55 లక్షల మంది మహిళలు సహా మొత్తం 86.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ తెలిపింది. వీరిలో 67,400 మంది వికలాంగులు, 158 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు.
Read Also: Jamili Elections: నేడు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి నివేదిక..
కాగా, జమ్ము అండ్ కాశ్మీర్ లో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.. 18-19 ఏళ్లలోపు మహిళా ఓటర్లు 1.56 లక్షల మంది ఉండగా, కొత్త మహిళా ఓటర్లు 1.35 లక్షల మంది ఉన్నారని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. మొత్తం 11629 పోలింగ్ కేంద్రాలకు గాను గ్రామీణ ప్రాంతాల్లో 9307, పట్టణ ప్రాంతాల్లో 2322 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 52 శాతం పోలింగ్ కేంద్రాల్లో (5814) వెబ్‌కాస్టింగ్ సదుపాయం ఉంది.. 267 మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఉంటాయని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం మహిళలే నిర్వహించే పోలింగ్ స్టేషన్లు 93, వికలాంగుల ద్వారా 83 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. అలాగే, అంతర్ రాష్ట్ర- అంతర్జాతీయ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘాలో భాగంగా మొత్తం 47 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు.. 385 అంతర్గత పోలీసు చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.
తాజావార్తలు
-
Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
-
DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
-
Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
-
Explainer: మానవాళి కథ ముగియబోతోంది!?
-
Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!