కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లో పోటీ చేయడంపై బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ వయనాడ్ లో ఎందుకు పోటీ చేస్తున్నాడు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేయొచ్చు కదా అని ఇండియా కూటమిలోని వామపక్ష పార్టీలే ప్రశ్నిస్తున్నాయని అన్నారు.
భారత దేశంలో ఎన్నికల హాడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికలను బీజేపీ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉందని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ దేశంలో పేదలు, దళితులు, మైనారిటీలు, ముస్లింలకు చోటు లేకుండా చేయడమే సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్ఆర్‌సీ లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు (శనివారం) రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనుంది. బీజేపీకి ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఆయన సహరాన్‌పూర్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే, సాయంత్రం ఘజియాబాద్‌లో రోడ్ షో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.
నేడు సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు.
Rahul Gandhi: ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ ప్రధానమంత్రిని సంయుక్తంగా ప్రకటిస్తామని ఈ రోజు అన్నారు.
Congress Manifesto: కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం సిద్ధమైంది. తాజాగా ఆ పార్టీ తన పోల్ మేనిఫెస్టోను విడుదల చేసింది. తమ మేనిఫెస్టో రైతులు, యువత, మహిళలకు పెద్ద పీట వేసినట్లు కాంగ్రెస్ చెబుతోంది. దేశంలో అన్ని వర్గాలతో మాట్లాడాకే మేనిఫెస్టోని రూపొందించినట్లు రాహుల్ గాంధీ చెప్పారు.
Hema Malini: బాలీవుడ్ నటి, మూడు సార్లు బీజేపీ తరుపున ఎంపీగా ఉన్న హేమమాలిని ఉత్తర్ ప్రదేశ్ మధుర ఎంసీ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. తాజాగా ఆమె ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆమె ఆస్తుల విలువ దాదాపుగా రూ.122 కోట్లు ఉంటుందని ప్రకటించారు.