తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రేపట్నుంచి ఎన్నికల నామినేషన్లు మొదలు కానున్నాయి. గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే... ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.
రేపటి నుంచి తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభకానుంది. అయితే.. ఈ నేపథ్యంలోనే రేపటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు వివరాలను బీజేపీ విడుదల చేసింది. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నట్లు పేర్కొంది బీజేపీ. 18 న మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్ వేయనున్నట్లు తెలిపింది బీజేపీ. మెదక్ రఘునందన్ రావు నామినేషన్ కు…
PM Modi: లోక్‌సభ తొలి విడత ఎన్నిల ఏప్రిల్ 19న జరగబోతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తొలి దశలో పోటీ చేస్తున్న బీజేపీ, ఎన్డీయే అభ్యర్థులకు వ్యక్తిగతంగా లేఖ రాశారు. ప్రధానమంత్రి సందేశం నియోజకవర్గంలోని ప్రతీ ఒక్కరికీ చేరేలా బీజేపీ కసరత్తులో ఈ లేఖ భాగంగా కనిపిస్తోంది.
Priyanka Gandhi: దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 180 సీట్లకు మించి రావని కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 స్థానాలు సాధిస్తుందనే నినాదాన్ని ఆమె బుధవారం తోసిపుచ్చారు.
Opinion Polls: లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
సంగారెడ్డిలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాధ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులను కూల్చేస్తామన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలో ప్రధాని మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం 200 ఏళ్లు వెనక్కి పోతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అభ్యర్థి టీఆర్ బాలుకు సపోర్టుగా శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ర్యాలీలో సీఎం పాల్గొన్నారు.
రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు పేర్కొన్నారు. 18 నుంచి 25 లోపు నామినేషన్లు తీసుకోవడం జరుగుతుందని.. రేపు సెక్షన్ 30, 31 నోటీసు ఇస్తామన్నారు. ఫారం - 1 పబ్లిక్ నోటీసుపై రిటర్నింగ్ అధికారి సంతకం చేస్తారని.. రేపు ఉదయం 11 గంటల నుంచీ నామినేషన్లు స్వీకరించడానికి సంసిద్ధం చేసుకుంటారన్నారు.