ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి…
కేరళ ప్రభుత్వం బక్రీద్ ను పురస్కరించుకుని కరోనా ఆంక్షల నుంచి మూడు రోజుల మినహాయింపునిచ్చింది. అయితే కేరళ ప్రభుత్వ నిర్ణయం విస్మయానికి గురిచేస్తోందని సుప్రీంకోర్టు మండిపడింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై అందరు యుద్ధం చేస్తున్న వేళ పూర్తి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని,…
లాక్ డౌన్ కాలంలో సినిమా షూటింగులు లేక సినీతారలు తమ మిగితా టాలెంట్ ను బయటపెట్టారు. కాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కాలంలో తన స్కిల్ ను చూపించింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లాక్ డౌన్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది. ‘కొవిడ్‌తో వచ్చిన విరామ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆన్‌లైన్ లో చాలా సబ్జెక్ట్‌లలో పరిజ్ఞానం పెంచుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే, వాళ్ళ పనిమనిషి అబ్బాయికి ఇంగ్లిష్ పాఠాలు కూడా…
కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఈనెల 19 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.. అయితే, ఈసారి మరిన్ని సడలింపులు కల్పించింది.. షాపులను రాత్రి 9 గంటల వరకూ తెరిచిఉంచేందుకు అనుమతిచ్చిన సర్కార్.. రెస్టారెంట్లను 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరుచుకోవచ్చని పేర్కొంది.. ఇక, పుదుచ్చేరికి బస్సు సర్వీసులను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా, తమిళనాడులో తాజాగా 3039 కరోనా…
డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో.. మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలను కఠినం చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో.. మొదటి రెండు దశలను రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. దీనికి…
డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాను భయపెడుతున్నాయి. మొదటివేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో డెల్టాకేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. సిడ్నినగరంలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నగరంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. Read: ఈటల చేరిక : తెలంగాణ బీజేపీలో నేతల వర్గపోరు? ఏయిర్‌పోర్ట్ లోని…
కరోనా సెకండ్ వేవ్ మొన్నటి వరకు విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా సెకండ్ కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను కేసీఆర్ సర్కార్ అమలు చేసింది. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే లాక్ డౌన్ ను ఎత్తేసింది సర్కార్. అయితే.. ఈ లాక్ డౌన్ టైంలో కొందరు ఆకతాయిలు…. రూల్స్ బ్రేక్ చేస్తూ.. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. వాళ్ల బుద్ది మారలేదు. దీంతో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్…
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు. తూర్పుగోదావరి జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉంటాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి మరుసటిరోజు…
జూన్ 19 వ తేదీతో లాక్‌డౌన్ ముగియడంతో 20 వ తేదీనుంచి ఎలాంటి పొడిగింపు లేకుండా లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేశారు. ఆదివారం నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రజలు రోడ్డుమీదకు వచ్చారు. దాదాపు నెల రోజులుగా ఇంటికే పరిమితమైన ప్రజలు, లాక్‌డౌన్ ఎత్తివేయడంతో నగరంలోని ప్రముఖ ప్రదేశాలను కుంటుంబ సభ్యులతో కలిసి పర్యటించేందుకు ఆసక్తి చూపించారు. నక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్, ఎన్‌టీఆర్ గార్డెన్స్, లుంబినిపార్క్, గోల్కొండ కోట ప్రజలతో కిటకిటలాడింది. ఇక చార్మినార్‌లో మరింత సందడి వాతావరణం…