కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేరళ.. గతంలో ఇచ్చిన సడలింపులు యథావిథిగా కొనసాగుతాయని ప్రకటించింది.. కేరళలో ఇంకా భారీగానే కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. దీంతో.. ఈ నెల 16వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినట్టు లెఫ్ట్ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈనెల 12, 13 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.. ఈ సమయంలో నిత్యావసరాల షాపులు, పరిశ్రమలకు ముడిపదార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు బ్యాంకులు…
తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రస్తుతం అక్కడ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటిని మూసేశారు. రాష్ట్రాలకు అదాయాన్ని అందించే మద్యం దుకాణలు సైతం మూతపడ్డాయి. గత నెల రోజులుగా లాక్‌డౌన్ ఆంక్షలు ఉండటంతో మందు షాపులు తెరుచుకోలేదు. దీంతో కొంతమంది పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. మందుబాబుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. క్వార్టర్ మందును ఏకంగా రూ.800 కి అమ్ముతున్నారు. తాగుడుకు బానిసలైన మందుబాబులు…
కరోనా మహమ్మారి కారణంగా కర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటివి అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకపోతుండటంతో మూగజీవాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మూగజీవాలకు శ్రీ మహావీర్ జైన్ పశుసేవా కేంద్రం ఆదర్శంగా నిలుస్తుంది. కల్లూరిపల్లిలో ఉన్న ఈ మూగజీవాల కేంద్రం ఎన్నో మూగజీవాలకు రక్షణగా నిలుస్తున్నది. ఈ మూగ జీవాలకు చెన్నైకు చెందిన ఓజంట అండగా నిలిచింది. ఇటీవల పెళ్లిచేసుకున్న చెన్నైకు చెందిన యువజంట ఈ మూగజీవాల కేంద్రం గురించి తెలుసుకొని…
తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. కరోనా కేసులు తగ్గుతుండటంతో లాక్‌డౌన్ పరిమితులను సడలించే అవకాశం ఉన్నది. మధ్యాహ్నం వరకు సడలింపులు ఉండటంతో సడలింపులు ఉన్న సమయంలోనే శుభకార్యాలు నిర్వహిస్తున్నారు. శుభకార్యాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరవుతుంటారు. ఇలాంటి శుభకార్యాల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోంది. తాజాగా, నిజామాబాద్ జిల్లాలోని నందిపేట మండలం కంఠం గ్రామంలో జరిగిన ఓ శుభకార్యం కొంపముంచింది. ఈ శుభకార్యం జరిగిన తరువాత గ్రామంలో గత వారం…
జూన్ 9 వ తేదీన తెలంగాణలో లాక్‌డౌన్ ముగియబోతున్నది. మే 31 నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో జూన్ 8 వ తేదీన తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కాబోతున్నది. జూన్ 8 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. ఈ…
ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం “లాక్ డౌన్” పొడిగించింది ప్రభుత్వం. క్రమేపి “లాక్ డౌన్” సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత “కరోనా” విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం. మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ…
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్రకటించగా.. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ పేరుతో కఠిన చర్యలకు పూనుకున్నాయి.. ఓ దేశలో రోజువారి కేసులు దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా నమోదు కాగా.. క్రమంగా తగ్గుతూ ఇప్పుడు లక్షకు చేరువయ్యాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.. ఇదే సమయంలో.. గుజరాత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.. దీంతో.. లాక్‌డౌన్ నుంచి క్రమంగా అన్‌లాక్‌కు వెళ్లోంది ఆ రాష్ట్రం.. ఇవాళ భారీగా సడలింపులు…
ఆపదలో ఉన్న గర్భవతి మహిళను పోలీసులు కాపాడిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కారణంగా గురువారం రాత్రి 9 గంటల సమయంలో వాహనాలు లేక ఇబ్బందిపడ్డా గర్భవతిని కాపాడారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. బోరబండ రాజీవ్ నగర్ కు చెందిన స్వాతి (20).. బోరబండ బస్ స్టాప్ వద్ద పురిటినొప్పులు రాగా అక్కడ ఎటువంటి వాహనాలు లేకపోవడంతో ఇబ్బంది ఎదుర్కొంది స్వాతి. బోరబండ బస్ స్టాప్ లో…