డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం అలర్టయ్యింది. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలున్నాయన్న హెచ్చరికలతో.. మరోసారి లాక్‌డౌన్ ఆంక్షలను కఠినం చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా రూపొందించిన ఐదు దశల్లో.. మొదటి రెండు దశలను రద్దు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఇకపై అన్ని జిల్లాల్లో మూడో దశలో విధించే ఆంక్షలు అమలు కానున్నాయి. దుకాణాలు సాయంత్రం 4 గంటల వరకే తెరిచి ఉంచనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. దీనికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఓవైపు కరోనా సెకండ్ వేవ్ పూర్తిస్థాయిలో అదుపులోకి రాకముందే.. ఇప్పుడు డెట్లా ప్లస్ వేరియంట్ ఓవైపు.. థర్డ్ వేవ్ హెచ్చరికలు మరోవైపు ప్రజలను కలవరపెడుతున్నాయి.