డెల్టా వేరియంట్ ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టా వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాపించింది. ఇప్పుడు ఈ వేరియంట్ కేసులు ఆస్ట్రేలియాను భయపెడుతున్నాయి. మొదటివేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో డెల్టాకేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. సిడ్నినగరంలో ఈ కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ నగరంలోని అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించి ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.
Read: ఈటల చేరిక : తెలంగాణ బీజేపీలో నేతల వర్గపోరు?
ఏయిర్‌పోర్ట్ లోని ట్రావెల్ బస్ డ్రైవర్‌కు కరోనా సోకడం, అక్కడి నుంచి డెల్టావేరియంట్ సిడ్నీ నగరంలో అనేక మందికి సోకడంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైరస్ చైన్‌ను కట్టడి చేసేందుకు ఎక్కడికక్కడ కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు.