కరోనా సెకండ్ వేవ్ మొన్నటి వరకు విజృంభించిన సంగతి తెలిసిందే. ఈ కరోనా సెకండ్ కారణంగా తెలంగాణలో లాక్‌డౌన్‌ను కేసీఆర్ సర్కార్ అమలు చేసింది. సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇటీవలే లాక్ డౌన్ ను ఎత్తేసింది సర్కార్. అయితే.. ఈ లాక్ డౌన్ టైంలో కొందరు ఆకతాయిలు…. రూల్స్ బ్రేక్ చేస్తూ.. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగారు. పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా.. వాళ్ల బుద్ది మారలేదు. దీంతో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసారు పోలీసులు. అయితే.. తాజాగా ఈ సీజ్ చేసిన వాహనాలను జరిమానాలు చెల్లించి తీసుకెళ్లాలని రాష్ట్ర పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది.
read also : చైనాకు షాకిచ్చిన శాంసంగ్ మొబైల్స్.. ఫ్యాక్టరీ ఇండియాకు తరలింపు
ఈ మేరకు జిల్లా ఎస్పీ, కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జరిమానాలు, ఈ-చలానా ద్వారా చెల్లించి వాహనాలను తీసుకుపోవచ్చని పేర్కొంది పోలీస్ శాఖ.అయితే…ఇందులో తీవ్రమైన కేసులను మాత్రం పోలీసులు కోర్టుకు పంపితే. వాహనదారులకు కోర్టులోనే జరిమానా విధించడం లేదా.. ప్రొసీడింగ్స్ ప్రకారం జైలు శిక్ష ఖరారు చేసే అవకాశం ఉండనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.