కేరళలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కట్టడి కోసం నైట్ కర్ఫ్యూను విధించినప్పటికీ కంట్రోల్ కావడంలేదు. ప్రతిరోజూ 30 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేరళ ముఖ్యమంత్రి కట్టడి కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజున రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కరోనా కట్టడిపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆదివారం రోజున లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. రోజుకో కొత్త వేరియంట్ తరహాలో.. ప్రజలను భయపెడుతూనే ఉంది… తాజాగా, డెల్టా వేరియంట్‌తో ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది.. ముఖ్యంగా ఆసీస్‌లోని సిడ్నీ డెల్టా వేరియంట్ దెబ్బకు వణికిపోతోంది.. దీంతో మహమ్మారి కట్టడికోసం కఠినమైన నిబంధనలకు పూనుకుంటుంది ప్రభుత్వం.. ఇప్పటికే అమల్లో ఉన్న లాక్‌డౌన్ నిబంధనలను మరోమారు పొడిగించింది. సెప్టెంబర్ చివరి వరకు సిడ్నీలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది ప్రభుత్వం… ఇక కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమల్లో ఉంటుందని వెల్లడించారు.…
కరోనా ఫస్ట్ వేవ్ అయినా.. సెకండ్ వేవ్ అయినా.. మహారాష్ట్రలో సృష్టించిన విలయం మామూలుది కాదు.. ఇప్పుడిప్పుడే కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది లేదు.. కానీ, ప్రజలు మాత్రం కోవిడ్ నిబంధనలు గాలి కొదిలి తిరిగేస్తున్నారు.. అయితే, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించకపోతే మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదని హెచ్చరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే.. కరోనా మహమ్మారితో పోరాటం కూడా స్వాతంత్ర్య పోరాటం లాంటిదేనని వ్యాఖ్యానించిన…
కరోనా మహమ్మారి మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదర్కొన్న చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. 2020 లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కాన్‌బెర్రాలో భారీగా కేసులు బయటపడటంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. క్రమంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెరిగినా.. ఎక్కువ రాష్ట్రాలు పాజివిటీ రేటు పడిపోయింది.. దీంతో.. ఆంక్షలు ఎత్తివేస్తూ.. సడలింపులు ఇస్తూ వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు.. బీహార్‌లో కూడా ఈ నెల 7వ తేదీ నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించిన బీహార్ ప్రభుత్వం.. ఆగస్టు 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప.. మిగతా రోజుల్లో అన్ని…
కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు 20 వేలకు పైగా నమోదవుతుండటంతో కేరళ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ, కేసులు కంట్రోల్ కావడంలేదు. పైగా రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం కట్టడికి కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నది. ఇకపై ప్రతి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేసులు కేరళ…
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా కొన్ని జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి తెలిపిన సంగతి తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాలపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉండటంతో అధికారులు అలర్డ్‌గా ఉన్నారు. అయితే, రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని వెలుగుమట్ల గ్రామంలో ఇప్పటికే స్వచ్చందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. సోమవారంతో ఆ గ్రామంలో లాక్‌డౌన్ ముగిసింది. అయినప్పటికే కేసులు నమోదవుతుండటంతో పాటుగా సోమవారం రోజున కరోనాతో ఒకరు…
ఆస్ట్రేలియాలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా సిడ్నీలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ రెండో దశ లాక్‌డౌన్ విధించింది. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సిడ్నీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. లాక్‌డౌన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఫ్రీడం, అన్‌మాస్క్ ది ట్రూత్ నినాదంతో ఆస్ట్రేలియాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సిడ్నీ సహా అనేక నగరాల్లో ప్రజలు…
కరోనా మహమ్మారి నుంచి భూప్రపంచం ఎప్పటికి బయటపడుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. మరో మూడు నాలుగేళ్లపాటు కరోనా నుంచి ఇబ్బందులు తప్పేలా కనిపించడంలేదు. కేసులు పెరిగినపుడు లాక్‌డౌన్ చేసుకుంటూ కంట్రోల్ అయినపుడు తెరుస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత్ పొరుగునున్న బంగ్లాదేశ్‌లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది ఆ దేశం. జులై 23 నుంచి రెండు వారాల పాటు అంటే ఆగస్టు 5 వరకు…