కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు కేబినెట్ పేర్కొంది.. అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది.. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని.. వైద్యారోగ్యశాఖ నివేదిక పరిశీలించిన…
ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయం ముగియనున్నది. జూన్ 9 నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే, జూన్ 20 నుంచి లాక్‌డౌన్ ను పొడిగిస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల నుంచి, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా…
బ్రిటన్‌లో ఈనెల 21 నుంచి లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్రిటన్‌లో బయటపడిన వేరియంట్‌లు తగ్గుముఖంపట్టగా, ఇప్పుడు ఆ దేశాన్ని డెల్టా వేరియంట్ భయపెడుతున్నది. సెకండ్‌వేవ్ సమయంలో ఇండియాను వణికించిన వేరింయంట్ ఇప్పుడు బ్రిటన్‌లో విజృంభిస్తోంది. డెల్టావేరియంట్ వేగంగా విస్తరిస్తుండటంపై ఆ దేశం ఆంధోళన చెందుతున్నట్టు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. లాక్‌డౌన్ ఎత్తివేత నిర్ణయం వాయిదా పడే అవకాశం ఉన్నట్టు ప్రధాని కార్యాలయం తెలిపింది. బ్రిటన్‌లో మరో నాలుగు…
ఢిల్లీలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కనిష్టస్థాయికి కేసులు చేరుకోవడంతో లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడం మొదలుపెట్టారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో కూడా కేసులు కేసులు పెద్దగా నమోదుకావడంలేదు. దీంతో మరిన్ని సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 50శాతం సీటింగ్ కెపాసిటితో రెస్టారెంట్లు, ప్రైవేట్ కార్యాలయాలకు అనుమతులు మంజూరు చేశారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మందికంటే ఎక్కువ మందికి అనుమతి లేదని ప్రకటించింది ప్రభుత్వం. ఇక ఢీల్లీలో పాఠశాలలు, సినిమా హాల్స్ మూసే…
తమిళనాడు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించింది ప్రభుత్వం. ఈనెల 21వ తేది వరకు సడలింపుల లాక్‌డౌన్ కొనసాగనుంది. లాక్‌డౌన్ పొడిగించే విషయమై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో చర్చలు జరిపారు. అమలవుతోన్న సడలింపుల లాక్‌డౌన్ 14తో ముగియనుండగా.. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోవడంతో మరో వారం రోజులపాటు పొడిగించారు. కాగా వైన్ షాపులను ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పార్క్, టీ షాపులకు ఇతర వాటికి…
తెలంగాణలో కొత్త లాక్‌డౌన్ సడలింపులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయి.. కానీ, కేసుల తీవ్రత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపులు ఉండగా.. ఇంకా పాజిటివ్ కేసులు భారీగా వెలుగు చూస్తున్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపులు ఉన్నాయి.. అయితే, రెండు జిల్లాలను కలుపుతూ ఉన్న ఒక పంచాయతీలో మాత్రం.. రెండు లాక్‌డౌన్‌లు అమలు చేయాల్సిన పరిస్థితి..…
తెలంగాణ ఇవాళ్టి నుంచి లాక్ డౌన్ సమయం తగ్గనుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్ సడలింపులు ఉండనున్నాయి. దీంతో తెలంగాణలో నేటి నుంచి ఆర్టీసీ సర్వీసులు సమయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని జిల్లాలకు ఆర్టిసి బస్సు సర్వీసులను నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి తెలంగాణలో 3,600 బస్సులు నడుస్తున్నాయని, అటు హైదరాబాద్ లో ఏకంగా 800…
తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సడలింపుల సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. కొత్త సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. మొత్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెసులుబాటు ఉండనుండగా.. మరో 12 గంటల పాటు.. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయనున్నారు. ఇక, లాక్‌డౌన్ సడలింపుల సమయం పెరగడంతో.. తన సేవల సమయాన్ని కూడా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులోకిరాని ఏడు నియోజకవర్గాలలో లాక్ డౌన్ ను యథాతథంగా అమలు చేయాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సత్తుపల్లి, మధిర, నల్లగొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ, నియోజకవర్గాల పరిధిలో మాత్రం, లాక్ డౌన్ ఇప్పుడు కొనసాగుతున్న యథాతధ స్థితినే కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఈ ఏడు నియోజకవర్గాల్లో ఉదయం 6 గంటల నుంచి పగలు 1 గంటల వరకు లాక్‌డౌన్ సడలింపు ఉంటుంది. కరోనా పరిస్థిని తెలుసుకునేందుకు…