కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగులు ఇంటికే పరిమితం అవుతున్నారు. గత ఏడాది కాలంగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంటికే పరిమితం కావడంతో ఆలస్యంగా లేవడం, శరీరానికి తగినంతగా వ్యాయాయం లేకపోవడంతో పరిమితికి మించి బరువు పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సమయానికి తినకపోవడం కూడా అనారోగ్యానికి, అధిక బరువు పెరగడానికి కారణం అవుతున్నది. పైగా జంక్ పుడ్‌కి అలవాటు పడటంతో శరీరంలో అనవసరంగా కొవ్వు పేరుకుపోవడంతో కొత్త అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి.
Read: పీఆర్ టీమ్ నోటి దురద… నోరూరించే ఆఫర్ మిస్ అయిన నోరా!
ఇలానే మరో ఐదేళ్లపాటు ఇంటికే పరిమితమై పనులు చేసుకుంటే, తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, విటమిన్ డి లోపం ఏర్పడే అవకాశాలు ఉంటాయని, ఫలితంగా శరీరం పాలిపోవడం, వంకర్లు తిరగడం, గూని వంటివి వచ్చే అవకాశాలు ఉంటాయని లాయిడ్స్ ఫార్మసీ డాక్టర్స్ అనే ఆన్‌లైన్ డాక్టర్స్ కన్సల్టెన్సీ సంస్థ తెలియజేసింది. వర్క్ ఫ్రం హోమ్ మంచిది కాదని చెప్పడం లేదని, పనితో పాటుగా రెగ్యులర్‌గా తప్పని సరిగా వ్యాయామం, సమయం ప్రకారం తిండి నిద్ర వంటికి కూడా ఉండాలని లాయిడ్స్ ఫార్మసీ డాక్టర్స్ కన్సల్టెన్సీ సంస్థ తెలియజేసింది.