సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ కేసులు క్రమంగా ఇతర దేశాలకు వ్యాపిస్తూనే ఉన్నాయి.. భారత్‌లోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు టెన్షన్ పెడుతున్నాయి.. అప్రమత్తమైన పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షల బాట పడుతున్నాయి.. ఇక, తమిళనాడులో ఇప్పటికే 120కి పైగా ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. ఆ రాష్ట్రం కూడా కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయానికి వచ్చింది.. Read Also: ఒమిక్రాన్ వెలుగుచూసిన చోట ఆంక్షలు ఎత్తివేత.. ఇవాళ్టి నుంచి కఠిన ఆంక్షలు అమలు చేయాలని…
ప్రపంచం మొత్తం ఒమిక్రాన్, కరోనా మహమ్మారులతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కు పుట్టినల్లైన చైనాలో కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు, వూహన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.…
కరోనా వైరస్‌కు పుట్టినిల్లు చైనా. చైనాలోని వూహాన్ నగరంలో ఈ వైరస్ పుట్టింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకిందిని చెబుతున్నా, ల్యాబ్ నుంచే లీక్ అయిందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వైరస్‌తో గత రెండేళ్లుగా ప్రపంచదేశాలు పోరాటం చేస్తున్నాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చినా వైరస్ లొంగడం లేదు. రూపం మార్చుకొని కొత్తగా విజృంభిస్తోంది. ప్రపంచం యావత్తు ఈ వైరస్ దెబ్బకు ఆర్ధికంగా కుదేలైపోయింది. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ వేరియంట్‌తో ఇబ్బందులు పడుతుంటే, చైనాలో…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో.. నివారణ చర్యలకు పూనుకుంటున్నాయి ఆయా దేశాలు.. ఇప్పటికే చాలా దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. కేసుల తీవ్రత పెరుగుతుండడంతో.. మళ్లీ మాస్క్ తప్పనిసరి చేస్తున్నాయి.. అందరూ వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు ఉపక్రమించాయి.. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.. ఈ క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. క్రిస్మస్ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమికూడే అవకాశం ఉండటంతో.. లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం…
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మళ్లీ మహమ్మారి పెరుగుతోంది… ఇక, జమ్ములోనూ రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు కర్ఫ్యూ విధించారు… కరోనా కట్టడిలో భాగంగా.. ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉటుందని.. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపారు..…
ఢిల్లీలో “సంక్షోభం లాంటి పరిస్థితి” ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రోజు తిరిగి సర్వోన్నత న్యాయస్థానం లో విచారణ ప్రారంభం అయింది. పంట వ్యర్ధాలను కాల్చడం ద్వారా కలిగే వాయు కాలుష్యం కేవలం 10 శాతమే అని నిర్ధారణ అయుందని ధర్మాసనానికి వివరించారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. అయుతే, “దేశ రాజధాని ప్రాంతం” ( ఎన్.సి.ఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ పొరుగు ప్రాంతాల్లో కూడా నిర్దిష్ట పరిమితులు, నిబంధనలు అమలు చేయాలని అఫిడవిట్ లో పేర్కొంది…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉన్నది. కొన్ని దేశాల్లో కరోనా దాదాపుగా తగ్గిపోయినా, కొన్ని చోట్ల తగ్గినట్టు తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. దీంతో నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా నుంచి బయటపడేందుకు తప్పనిసరిగా టీకాలు తీసుకోవాలి. ప్రతీ దేశంలో టీకాలు వేస్తున్నారు. అయితే, కొంతమంది టీకాలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి అక్కడి ప్రభుత్వాలు. ఇక యూరప్‌లోని ఆస్ట్రియాలో కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. Read: మస్క్‌కు నెటిజన్లు చురకలు… ఎలన్‌కు…
కరోనాకు పుట్టినిల్లు చైనా. చైనాలోని ఊహాన్ నగరంలో తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత కరోనా ప్రపంచవ్యాప్తమైంది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. లక్షలాది మంది మృతి చెందారు. ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని ఈ సమస్య పట్టిపీడిస్తూనే ఉన్నది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినా కేసులు కంట్రోల్‌కావడం లేదు. కరోనా కొత్తగా రూపాంతరం చెందుతూ ఎటాక్ చేస్తున్నది. తిరిగి తిరిగి మళ్లీ అక్కడికే వచ్చినట్టుగా కరోనా కేసులు…
ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్‌తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్‌లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్‌లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ…
రెండేళ్ల క్రితం 2019 డిసెంబర్‌లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత అక్కడి నుంచి ఈ వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. వైరస్ వ్యాప్తి తరువాత ఇప్పుడు మరోసారి చైనాలో కేసులు వెలుగుచూస్తున్నాయి. చైనాని దక్షిణ ప్రావిన్స్‌లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో దక్షిణ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో తిరిగి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. డెల్టావేరియంట్ కేసులు పెరుగుతుండటంతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పుతియాన్ నగరంలో కేసులు పెరుగుతున్నాయి.…