మే 12 వ తేదీ నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ మే 30 వ తేదీతో ముగియనున్నది. అయితే, లాక్ డౌన్ కొనసాగింపు విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ప్రజల అభిప్రాయం మేరకు లాక్‌డౌన్ కొనసాగింపు లేదా సడలింపు సమయం పెంపు తదితర అంశాలపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈనెల 30…
తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో…
కరోనా మహమ్మారి వైరస్ వివిధ రకాల ఉత్పరివర్తనాలుగా మార్పులు చెందుతోంది. అందులో ఒకటి బి.1.617 వేరియంట్. ఇది ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందింది. ఇండియాతో పాటుగా ప్రపంచంలోని దాదాపుగా 60 దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. ఈ వేరియంట్ కారణంగా దేశంలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరగడానికి కూడా ఇదోక కారణం అని చెప్పొచ్చు. ఈ వేరియంట్ కేసులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెరుగుతున్నాయి. విక్టోరియా రాష్ట్రంలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో…
తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు కోనసాగుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర, సరుకు, అంబులెన్స్ కు…
తెలంగాణలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. 10 గంటల నుంచి తిరిగి తెల్లవారి 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్‌డౌన్ సమయం ముగుస్తుంది. మే 30 తరువాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విషయంపై ఈ నెల…
పోలీసులు ప్రాణాలను అడ్డంపెట్టి లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు.ప్రజల ప్రాణాల రక్షణ కోసం మేము నిరంతరం పని చేస్తున్నాం. మీరు క్షేమంగా ఇళ్లల్లో ఉండండి మేము రోడ్లమీద మీ కోసం పని చేస్తున్నాం అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ ను ప్రజలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. అనవసరంగా ఎవరు ప్రజలు రోడ్ల మీదికి రావద్దు. వాహనాలు సీజ్ చేసినట్లయితే లాక్ డౌన్ పూర్తయిన తర్వాతనే అప్పగిస్తాం. 99% లాక్ డౌన్ సమర్థవంతంగా విజయవంతమైంది…
మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. అయితే ఈ లాక్ డౌన్ లో భారత సైనికులకు కష్టాలు ఎదురయ్యాయి. తినడానికి ఆహారం లేక ఇబ్బంది పడ్డారు సైనికులు. అయితే ముంబయి నుండి హైదరాబాద్ మీదుగా బెంగుళూరు వెళుతున్న భారత సైనికులకు లాక్ డౌన్ కారణంగా రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాలలో మూత పడ్డ హోటళ్ళు ఎదురయ్యాయి. అయితే సైనికులు ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నారనే…
సంగారెడ్డి జిల్లాలో కఠినంగా లాక్ డౌన్ అమలు పరిచే విధంగా జిల్లాకు రావడం జరిగింది అని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర సరిహద్దులతో పాటు తెలంగాణ రాష్ట్ర ఈ పాస్ లు, ఇతర రాష్ట్రాల ఈ పాస్ లు ఉన్న రాష్ట్ర సరిహద్దులోకి అనుమతి ఇస్తున్నాము. ఎలాంటి పని లేకుండా రోడ్లపై కి వస్తే కేసు నమోదు చేస్తాం, మళ్ళీ అదే విధంగా లాక్ డౌన్ నిభందనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేస్ లు నమోదు చేస్తాం…
గ్రేటర్ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో కమిషనరేట్ పరిధిలో ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. కమిషనరేట్ పరిధులు దాటాలంటే తప్పనిసరిగా పాసులు ఉండాలని పోలీసులు స్ఫష్టంచేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో పాసులు లేని వారిని కమిషనరేట్ సరిహద్దులు దాటనివ్వడం లేదు. రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఏ కమిషనరేట్‌లో లిమిట్ దాటాలన్నా పాసులు ఉండాలని, అత్యవసర సర్వీసులు, ఎసెన్సియల్ సర్వీసుల వారికి మాత్రమే పాసులు లేకుండా అనుమతులు ఉంటాయని పోలీసులు స్ఫష్టం చేస్తున్నారు.…
విశాఖ జిల్లాలోని సీలేరు నదిలో రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. ఈ రెండు పడవల్లో మొత్తం 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులంతా వలస కూలీలుగా గుర్తించారు. ఈ ఘటన మల్కాన్ గిరి జిల్లా కెందుగడ వద్ద జరిగింది. తెలంగాణలో లాక్‌డౌన్ కావడంతో వీరంతా సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగడకు చెందిన వారిగా గుర్తించారు. సీలేరు నదిలో గల్లంతయిన ఏడుగురి…