పోలీసులు ప్రాణాలను అడ్డంపెట్టి లాక్ డౌన్ లో విధులు నిర్వహిస్తున్నారు.ప్రజల ప్రాణాల రక్షణ కోసం మేము నిరంతరం పని చేస్తున్నాం. మీరు క్షేమంగా ఇళ్లల్లో ఉండండి మేము రోడ్లమీద మీ కోసం పని చేస్తున్నాం అని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. లాక్ డౌన్ ను ప్రజలు సమర్ధవంతంగా వినియోగించుకోవాలి. అనవసరంగా ఎవరు ప్రజలు రోడ్ల మీదికి రావద్దు. వాహనాలు సీజ్ చేసినట్లయితే లాక్ డౌన్ పూర్తయిన తర్వాతనే అప్పగిస్తాం. 99% లాక్ డౌన్ సమర్థవంతంగా విజయవంతమైంది అని తెలిపారు. కొంతమంది పాసులను మిస్ యూజ్ చేస్తున్నారు. పాసులను మిస్ యూస్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తున్నాం. ఈ కామర్స్ లో మెడికల్ తో పాటుగా కరోనా రోగులకు ఆహారం అందించేందుకు పని చేయాల్సి ఉంటుంది అని స్పష్టం చేసారు.