గత ఏడాదిన్నర కాలంగా మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న సంగతి తెలిసిందే. అనతికాలంలోనే ఈ మహమ్మారి.. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. వైరస్ ఉధృతికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, ఇటలీ తదితర దేశాలు చిగురాటాకుల వణికిపోయాయి. ఇక ప్రస్తుత కేసుల పరిస్థితి చూస్తే.. భారత్ కరోనా సెకండ్ వేవ్ నుంచి బయటపడినట్లే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. రికవరీలు పెరుగుతున్నాయి. 24 గంటల్లో కొత్త కేసుల కంటే…
గతేడాది విధించిన లాక్‌డౌన్ కారణంగా వాయు నాణ్యత పెరిగినట్లు ఎన్విరాన్‌మెంట్ రీసెర్చి జర్నల్ తాజా అధ్యయనంలో తెలిపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాలపై పరిశోధనలు చేశారు. గత ఏడాది మార్చి నుంచి మే మధ్య లాక్‌డౌన్ సమయంలో పరిస్థితులను విశ్లేషించారు. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా భూ, వాయుమార్గాల్లో రవాణా గణనీయంగా తగ్గడం, పారిశ్రామిక కార్యకలాపాలు ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల వాతావరణం బాగా మెరుగైనట్లు అధ్యయనం వెల్లడించింది. వాతావరణ కాలుష్యం వంటివాటిలో మార్పులను అధ్యయనం…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ ఇంటి పట్టునే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. అలా తమన్నా కూడా షూటింగ్‌లు లేక ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తాజాగా తమన్నా ఓ సందేశాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసింది. షూటింగ్స్ లేక రోజువారీ పనిదినాల్లో కూడా మార్పులు రావడంతో తమన్నా డైలామాలో తెలుస్తోంది. ‘స్నానం చేయాలా.. ? వద్దా..? అనే సందేశాన్ని వ్యక్తం చేస్తూ.. ఓ సలహాని ఇవ్వాలంటూ కోరింది. లాక్ డౌన్ ఇలా…
కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన వంతు సాయంపై స్పందించింది. ‘సినిమా వాళ్లు సేవా కార్యక్రమాలు చేయడం లేదనే అపోహను ఆమె తిప్పికొట్టింది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను అని…
కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదు కావడంతో.. ఆయా రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు వెళ్లాయి.. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ లాంటి నిర్ణయాలు తీసుకుని కఠినంగా అమలు చేస్తున్నాయి.. మరోవైపు.. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను స్వస్తి చెప్పి.. అక్రమంగా సడలింపులు ఇస్తూ అన్‌లాక్‌లోకి వెళ్లిపోతున్నాయి.. అయితే, అన్‌లాక్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది.. అన్‌లాక్‌కు వెళ్లే సమయంలో.. రాబోయే థర్డ్ వేవ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం…
లాక్‌డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని టీఎస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు, వారి క్లర్కులు స్టెనోలను అనుమతించాలని… బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే న్యాయవాదులను అనుమతించాలని హైకోర్టు తెలిపింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలు అడ్డుకోవద్దు. న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయొద్దు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం, డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఐడీ కార్డు చూపినా న్యాయవాదులను అవమానిస్తే తీవ్రంగా పరిగానిస్తామని హైకోర్టు…
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాఢంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా వేడుకలను సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత బయటకు ఎవరూ రాకూడదు అనే సంగతి తెలిసిందే. దీంతో ఉదయం సమయంలోనే వేడుకలను సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ వేడుకలు జరిగినా 10 మందికి మించకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా…
కరోనా వైరస్ చాలా మంది జీవితాల్ని అతలాకుతలం చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. కష్టకాలంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఎందరో సినీ సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి షకీలా పేదవారికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షకీలా చేస్తున్న సేవ పట్ల పలువురు ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్న వారికి మీకు తోచినంత సాయం…
తెలంగాణలో కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. గత రెండు నెలల్లో నమోదైన కేసుల వివరాలని హైకోర్టుకు సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ పై 150 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని…
ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో సినిమా షూటింగులు లేక సెలెబ్రిటీలందరు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఖాళీ సమయాల్లో ఎవరికీ నచ్చిన పని వారు చేసుకుంటూ గడిపేస్తున్నారు. తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ వంటగదిలోనూ మేటి అని చూపించుకున్నారు. తనకెంతో ఇష్టమైన రెసిపీని వండారు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇదిలావుంటే, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతి ఒక్కరూ విధిగా…