రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా, లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 గంటల తరువాత ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడం లేదు. కరోనా, లాక్ డౌన్ ప్రభావం మెట్రో పై తీవ్రమైన ప్రభావం చూపింది. మొత్తం మూడు కారిడార్లలో మెట్రో రైళ్లునడుస్తున్నాయి. లాక్ డౌన్ కాలంలో ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో ఉండగా చివరి మెట్రో రైలు 8.45 గంటల అందుబాటులో ఉంది. దీంతో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పడిపోతూ వస్తున్నది. మే 12…
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలు దాదాపుగా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇళ్లకే పరిమితం కావడంతో జననాల రేటు పెరుగుతుందని అధికారులు భావించారు. కానీ, అందుకు విరుద్ధంగా జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో సంతానోత్పత్తిపై దృష్టి సారిస్తారని అనుకున్నారు. కరోనా మహమ్మారి ఆర్ధిక పరిస్థితులపై ప్రభావం చూపించాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. పోయిన ఉద్యోగాలపై దృష్టి సారించారు. దీంతో 2020లో జననాల రేటు తగ్గింది. 2019 లో అమెరికా మొత్తం మీద 37.5 లక్షల మంది…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కర్ఫ్యూ నిబంధనలు అమలు జరుగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. అయితే, ఈ సడలింపులు సమయంలో కూడా పర్యాటకులు అరకు వ్యాలీలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అరకు వ్యాలీలో లాక్ డౌన్…
కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండడంతో.. మహమ్మారి కట్టడికి అన్ని రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అందులో కేసులు భారీగా వెలుగు చూస్తున్న రాష్ట్రాలు లాక్‌డౌన్‌కు పూనుకున్నాయి.. కరోనా కంట్రోల్ కాకపోవడంతో.. మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నాయి.. ఇక, లాక్‌డౌన్ ను మే 31వ తేదీ వరకు తాజాగా నిర్ణయం తీసుకుంది నాగాలాండ్ ప్రభుత్వం.. కరోనా పాజిటివ్ కేసుల్లో తగ్గుదల ఏమాత్రం లేకపోవడంతో లాక్‌డౌన్ పొడిగింపునకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపినట్టు అధికారులు వెల్లడించారు.. అయితే, లాక్‌డౌన్ నుంచి…
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్… అయితే లాక్‌డౌన్ సడలింపుల సమయంలోనే కాదు.. ఎప్పుడు పడితే అప్పుడు రోడ్డు ఎక్కేవారి సంఖ్య భారీగానే ఉంది… అసలు తమకు ఏదీ పట్టనట్టుగా చిన్నచిన్న కారణాలు చెప్పి యథేచ్ఛగా తిరిగేస్తున్నారు కొందరు. దీంతో.. లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు తెలంగాణ పోలీసులు.. ఈ మేరకు పోలీసు అధికారులకు డీజీపీ…
బాలీవుడ్ బిగ్ స్టార్స్ కి కరోనా లాక్ డౌన్స్ బలమైన పాఠాల్నే నేర్పుతున్నాయి. పోయిన ఏడాది ఫస్ట్ లాక్ డౌన్ లో అక్షయ్ కుమార్ సహా చాలా మంచి స్టార్స్ తమ సినిమాలతో ఓటీటీ వేదికలపైకి వచ్చేశారు. లాభనష్టాలు ఎలా ఉన్నా థియేటర్లు లేకపోవటంతో ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి వచ్చేయటమే బెటర్ అని బాలీవుడ్ భావించింది. అయితే, 2020 తరువాత 2021లో కూడా కరోనా ఇంకా షాకిస్తూనే ఉంది. అందుకే, మళ్లీ బాలీవుడ్ కి ఓటీటీ బాట…
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండడంతో.. మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించింది ఒడిశా ప్రభుత్వం… జూన్ 1వ తేదీ వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది.. మే 5 నుంచి అమలు చేసిన రెండు వారాల లాక్‌డౌన్ ఈ నెల 19వ తేదీతో ముగియనుండగా.. అయితే, ఆరోగ్య నిపుణులను సంప్రదించిన తర్వాత మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించినట్టు ప్రభుత్వం పేర్కొంది… ఒడిశాలో పాజిటివిటీ రేటు 20 శాతంగా ఉండగా… దాదాపు రెండు వారాల లాక్‌డౌన్ తర్వాత ఇప్పుడు…
కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో మే 24 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మరో ఐదు రోజుల్లో లాక్ డౌన్ ముగియనుండటంతో మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరో రెండు రోజుల్లో లాక్‌డౌన్ పొడిగింపుపై కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకోనున్నది. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నప్పటీకి కరోనా కేసులు కంట్రోల్ కావడంలేదు. రోజువారి కేసులు 38 వేలకు పైగా నమోదవుతున్నాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ను అమలు చేస్తే…
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బెంగాల్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ అమలు చేస్తున్నా, కొంత సమయంపాటు సడలింపులు ఇస్తున్నారు. లాక్ డౌన్ సడలించిన సమయంలో అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే, కొంతమంది మాత్రం ఈ లాక్‌డౌన్ సమయంలో విచిత్రంగా ప్రవర్తిస్తు పోలీసులను ఇబ్బందులు పెడుతున్నారు. బెంగాల్‌లో లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నా, బెంగాలీ స్వీట్స్…
టౌటే తుఫాన్ ధాటికి తీరప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఆ తుఫాన్ ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇక, దీని ప్రభావం తెలుగురాష్ట్రాలపై పడింది. హైదరాబాద్‌లో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. లాక్‌డౌన్ సడలింపుల సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే భారీ వర్షం కురవడం మొదలైంది. బంజారాహిల్స్,…