తెలంగాణలో లాక్‌డౌన్ ఆంక్షలు కోనసాగుతున్నాయి. కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ప్రైవేట్ వాహనాలను నిలిపివేశారు. ఈ పాస్ ఉంటేనే వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. దీంతో టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులు, కార్లు అనేకం నిలిచిపోయాయి. పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర, సరుకు, అంబులెన్స్ కు మాత్రమే పాస్‌లు లేకున్నా అనుమతిస్తున్నారు.