ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కట్టడికి ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. కర్ఫ్యూ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కరోనా మహమ్మారి కేసులు ఏ మాత్రం తగ్గడంలేదు. దీంతో జూన్ 1 వ తేదీ నుంచి ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సిద్దమయ్యారు. రూరల్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం…
తెలంగాణలో ఈనెల 12 నుంచి లాక్‌డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజుతో లాక్ డౌన్ ముగియనుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. కొద్ది సేపటి క్రితమే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లాక్‌డౌన్‌పై ప్రజాభిప్రాయ సేకరణ చేసిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపుతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో…
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ తెలంగాణ క్యాబినెట్ సమావేశం అవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఓ విజ్ఞప్తి చేశారు. అందులో తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం. లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ మంత్రివర్గం ఇవాళ సమావేశమవుతోందని… లాక్ డౌన్ పై తన వ్యతిరేకతను మరోమారు స్పష్టం చేస్తున్నానని పేర్కొన్నారు. కోవిడ్ 19 ను ఎదుర్కొనేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు…దీంతో పేదల జీవితాలు నాశనమవుతాయని తెలిపారు.…
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ పొడిగింపు, తదితర అంశాల మీదపై కేబినెట్ చర్చించనున్నది. రాష్ట్రంలో ఇవాళ్టితో 18 రోజుల లాక్ డౌన్ ముగియనుంది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో లాక్ డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వీక్ ఎండ్ లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ వైపు అడుగులు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.…
తెలంగాణలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. నిబంధనలు పాటించని వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఓ పక్క వాహనాలను సీజ్ చేస్తున్న పోలీసులు.. మరోపక్క ఆకతాయిలను ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. చాలా చోట్ల డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే, తాజాగా నిబంధనలను విరుద్దంగా పెళ్ళికి ఎక్కువమందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు పోలీసులు.. వికారాబాద్ జిల్లాలోని కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది.…
కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని రాష్ట్రాలను మాత్రం ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది.. దీంతో.. కరోనా కట్టడికి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.. తాజాగా, తమిళనాడు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది.. జూన్ 7 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది తమిళనాడు సర్కార్.. ప్రస్తుత లాక్‌డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ఉదయం 7 గంటల…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగనుంది.. ఈ నెల 5వ తేదీన ఏపీలో కర్ఫ్యూ ప్రారంభించగా.. కొత్త కేసులు కంట్రోల్ కాకపోవడంతో.. కర్ఫ్యూను మరింత టైట్ గా అమలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కేసుల తీవ్రతను బట్టి లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు.. తాజాగా, కరోనా కేసుల కట్టడికి అనంతపురం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది……
కరోనా కట్టడికి చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి.. ఈ చర్యకు పూనుకున్న తర్వాతే కేసులు తగ్గుముఖం పట్టినట్టు చెబుతున్నారు.. అయితే, లాక్‌డౌన్ పెట్టుకోవాలా? లేదా? అనేది ఆయా రాష్ట్రాల ఇష్టం అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ పెట్టుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని.. కానీ, నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్రాలే అన్నారు.. ఇక, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల ముక్కుపిండి ఫీసులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. ఆస్తులు అమ్మి బిల్లులు…
తెలంగాణలో ఒకవైపు లాక్‌డౌన్ కొనసాగుతుండగా మరోవైపు రైతులు ఆంధోళనలు చేస్తున్నారు. తెలంగాణలోని తుఫ్రాన్ మండలంలోని యానాపూర్ లో రైతులు రోడ్డు మీదకు వచ్చి ఆంధోళనలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు నిరసనలు చేస్తున్నారు. పంటను రోడ్లపై పోసి తగలబెట్టారు. దీంతో గజ్వేల్-తుఫ్రాన్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లాక్ సడలింపుల సమయంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని లేదంటే ఆంధోళనలు ఉదృతం చేస్తామని…