జమ్మూ కాశ్మీర్‌లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్‌లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..
Aganampudi Toll Gate: విశాఖలోని గాజువాక పరిధిలో ఉన్న అగనంపూడి టోల్గేట్ ని ఎట్టకేలకు తొలగించారు.. ఎప్పటి నుండో వివాదాస్పదంగా ఉన్న అగనంపూడి టోల్ గేట్ నుండి రోజు లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించేవి.. అటు వర్తకులు, చిరు వ్యాపారులు, ఫార్మా కంపెనీలకు వెళ్లే వాహనాలు ఏడాదికి లక్షలాది రూపాయలు టోల్ ఫీజులు కట్టుకుంటూ వస్తున్నారు.. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ టోల్ గేట్ కు చుట్టుపక్కల ఉన్న నిర్వాసిత గ్రామ ప్రజలు టోల్ చార్జీలు కట్టుకోలేక…
సింగరేణి సంస్థలో కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో స్థానికులకే 80 శాతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని సింగరేణి డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సింగరేణి డైరెక్టర్ బలరాం సర్క్యులర్ జారీ చేశారు. దీంతో.. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి ఫలించినట్లైంది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు అధికారులు.. అయితే, ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చిన తక్కళ్లపల్లి గ్రామస్తులు, మహిళలు… ఆ టవర్లను కూల్చివేశారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. కాగా.. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు.. తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి అమెజాన్…