CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక సమావేశాలతో రెండు రోజుల పర్యటనను ముగించుకుని ఈ రోజు హైదరాబాద్ తిరిగి చేరుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, పార్టీ వ్యూహాలను సిద్ధం చేయడం, కేంద్ర మంత్రులతో రాష్ట్రాభివృద్ధిపై చర్చించడం వంటి అనేక అంశాలపై ఆయన ఢిల్లీలో సమాలోచనలు నిర్వహించారు. కేంద్రంలో ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో త్వరలో…
Mahesh Kumar Goud: స్థానిక సంస్థల ఎన్నికలపై రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న ఈ ఎన్నికల విషయంలో మంత్రి పొంగులేటి ప్రకటన చేయడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. ఈ తరహా అంశాలను కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, వాటిని ముందుగానే మీడియాకు వెల్లడి చేయడం సరైంది కాదని…
Ponguleti Srinivas Reddy : ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల తరువాత నివేదికల…
Ponguleti Srinivas Reddy : పాలేరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఖమ్మం రూరల్, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. ఒక్కో మండలానికి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీలక సూచనలు చేశారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల…
నేడు హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్, కౌంటింగ్ సాగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ ఆఫీసీయో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కు సర్వం సిద్ధమైంది. రేపు జీహెచ్ఎంసీలో హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. రేపు జరిగే ఎన్నికకు ఏప్రిల్ 25న కౌంటింగ్ చేసి ఫలితాల ప్రకటిస్తారు.
Kishan Reddy : కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చేసినా తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలుచుకున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఓటర్లు బీజేపీకి మద్దతు తెలిపారని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు.…
హర్యానాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్‌కు ఎన్నికలు జరిగాయి.
GHMC: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్టాండింగ్ కమిటీ సభ్యుల నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది. మొత్తం 15 స్టాండింగ్ కమిటీ సభ్యుల స్థానాలకు 17 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవన్నీ చెల్లుబాటు అయ్యేలా ఉన్నాయని GHMC కమిషనర్, రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కమిటీ సభ్యులుగా నిలబడిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంది. ఈ లోపు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే, స్టాండింగ్…
స్థానిక సంస్థల ఎన్నికలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ శిత్తశుద్ధితో లేకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్‌కు చురకలు అంటించారు. ఢిల్లీలో ఆప్‌కు, కాంగ్రెస్‌కు అదే ఎదురైందని అన్నారు.