దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. మీ పెతాపమో.. మా పెతాపమో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరిన టీడీపీకి..ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయా? తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారా? మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని చాటుకోక తప్పదా? ఏపీలో వివిధ కారణాలతో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు నామినేషన్ల దాఖలు, ఏకగ్రీవాల విషయంలో అధికారపార్టీ…
ఏపీలో గతంలో పెండింగ్లో ఉన్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలు కానున్నాయి. గురువారం అమావాస్య కావడంతో పెద్దగా నామినేషన్లు దాఖలు కాలేదని తెలుస్తోంది. దీంతో శుక్రవారం నాటి పరిస్థితిని ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమీక్షిస్తోంది. ప్రతి రెండుల గంటలకోసారి ఎస్ఈసీ అధికారులు నివేదిక తెప్పించుకుంటున్నారు. అయితే ఈ దఫా ఎన్నికల్లోనే కాకుండా నామినేషన్ల పర్వంలోనూ అక్రమాలు…
కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై బిజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉందని..ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విష్ణు వర్ధన్ రెడ్డిమండిపడ్డారు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని..చేతల్లో చర్యలు లేవన్నారు. ప్రయివేటు ఆసుపత్రిలో ఎక్కడైనా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు ఏ ఒక్కరైనా ఆధారాలతో నిరూపించగలరా? రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారు.. కనీసం 10…