అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే.... ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?
అధికారంలోకి వస్తే.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు సిద్ధమవుతోంది. కానీ.. చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ల పెంపు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు కార్యాచరణ రూపొందుతోందట.
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు.
మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
లోకల్ బాడి ఎన్నికలను సాధ్యమైనంత తొందరగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
తమిళనాడులో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వెల్లూరు నుంచి 37వ వార్డుగా పోటీ చేసిన డీఎంకే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ విజయకేతనం ఎగురవేశారు. తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో ఓ ట్రాన్స్‌జెండర్ విజయం సాధించడం ఇదే తొలిసారి. దీంతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. గంగానాయక్ సామాజిక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దక్షిణ భారత ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. కాగా ట్రాన్స్‌జెండర్ గంగానాయక్ తల్లిదండ్రులు దినసరి కూలీలుగా పనిచేస్తుండటం…
తమిళనాడులో సినిమా వాళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిన సీఎంలు సినిమా వాళ్లే కావడం విశేషం. సినీ పరిశ్రమకు చెందిన కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖులు. అనంతరం విజయ్ కాంత్, కమల్‌హాసన్ వంటి హీరోలు కూడా రాజకీయ పార్టీలను ప్రారంభించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్టార్ హీరో విజయ్ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశాడు.…
ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్టీల ఇష్టం. బలం లేనిచోట పోటీకి ఆలోచనలో పడతాయి. ఏకగ్రీవంగా గెలిచే పార్టీలో సంబరాలే సంబరాలు. కానీ.. అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న సంబరాలు వేరే ఉన్నాయట. ఎవరో ఒకర్ని పోటీకి పెడితే.. తమ పంట పండుతుందని ప్రత్యర్థి పార్టీలను వేడుకుంటున్నారట. ఎందుకో.. ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోరుకుంటున్నారా? తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్ట్లీ. ఏ చిన్నపాటి ఎన్నిక వచ్చినా డబ్బులు…
ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి.. గడచిన స్థానిక ఎన్నికల మాదిరిగానే ఇప్పుడూ అరాచకాలు చేశారంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. చాలా చోట్ల అభ్యర్థులని బెదిరించి విత్ డ్రా చేయించారన్న ఆయన.. పోలీసులే ఎన్నికల్లో సెటిల్మెంట్లు చేస్తూ అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.. నామినేషన్ విషయంలో ఇన్ని జాగ్రత్తలు మేం ఎప్పుడూ తీసుకోలేదని గుర్తుచేసుకున్న టీడీపీ అధినేత.. పోటీ చేయాలనుకునే అభ్యర్థికి సహకరించాల్సిన…