మధ్యప్రదేశ్‌లోని రేవాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సమోసాలో బల్లి కనిపించడంతో ఇక్కడ కలకలం రేగింది. దీంతో ఐదేళ్ల చిన్నారి ఆరోగ్యం క్షీణించింది. నిజానికి.. సమోసా తిన్న తర్వాత రేవాలోని 5 ఏళ్ల చిన్నారికి వాంతులు, కడుపునొప్పి మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు సంజయ్ గాంధీ మెమోరియల్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారి కుటుంబం హోటల్ యజమానిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Lizard in Samosa: ఇటీవల కాలంలో బయటి ఆహారంతో జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో పుడ్ ఫాయిజనింగ్ వల్ల ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో చికెన్ షవర్మా వల్ల ఒకరిద్దరి ప్రాణాలు పోయాయి. రెస్టారెంట్ల, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారుల నిఘా లేకపోవడం కూడా సమస్య తీవ్రతను పెంచుతోంది. ఆహారంలో బల్లులు, కీలకాలు, ఎలుకలు రావడం పరిపాటిగా మారింది. సామాన్య జనాల ప్రాణాలతో ఫుడ్ మాఫియా ఆటలాడుకుంటోంది.