ఇప్పటివరకు సినిమాలు, వెబ్ సిరీస్‌లతో క్రేజ్ సంపాదించుకున్న అమెజాన్ ప్రైమ్ కొత్తగా క్రీడాభిమానులకు గాలం వేసేందుకు రంగం సిద్ధం చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో తొలిసారిగా క్రికెట్ లైవ్ ప్రారంభమైంది. శనివారం నాడు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట అమెజాన్ ప్రైమ్‌లో లైవ్ స్ట్రీమ్ అయ్యింది. దీంతో క్రికెట్ అభిమానులు టీవీ ఛానళ్ల జోలికి వెళ్లకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ ద్వారా క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ…