Business Headlines 27-02-23: ఆర్థిక వృద్ధి ఆశాజనకంగా లేదు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎక్కువగానే ఉంటుందని, ఆర్థిక వృద్ధి మందగిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానెటరీ పాలసీ కమిటీ సభ్యుడు జయంత్ ఆర్ వర్మ అన్నారు. ఆర్థిక వృద్ధి బలహీనంగా ఉండటం వల్ల అంచనాల కన్నా తక్కువగానే నమోదవుతుందని తెలిపారు. వడ్డీ రేట్లు పెరగటం వల్ల ఆ ప్రభావం ఈఎంఐలపై పడి ఫ్యామిలీ బడ్జెట్ తగ్గుతుందని చెప్పారు. చివరికి ఖర్చులు సైతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు.
ఆసియాలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలపై చైనా కన్నేసింది. చైనా బెల్ట్ రోడ్ ప్రాజెక్ట్ పేరుతో వివిధ దేశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ ఆయా దేశాలను రుణదేశాలుగా మారుస్తున్నది. ఆఫ్రికాలోని అనేక దేశాలను చైనా ఈ విధంగానే లోబరుచుకున్నది. చైనా ఆగడాలకు చెక్ పెట్టేందుకు యూరోపియన్ దేశాల సమాఖ్య 300 బిలియన్ డాలర్లతో గ్లోబల్ గేట్‌వే ను ప్రకటించింది. ఇది చైనా మాదిరిగా చీకటి ఒప్పందాలు ఉండవని, దేశాలను అప్పులు ఊబిలోకి నెట్టడం జరగదని, చిన్న…
ప్రపంచవ్యాప్తంగా చైనా కంపెనీలకు చెందిన మొబైళ్లు ఎలా విస్తరిస్తున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ ధరకు మార్కెట్లో దొరుకుతుండటంతో విచ్చలవిడిగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, చైనా మొబైళ్ల ద్వారా వినియోగదారుల డేటాను చైనా ప్రభుత్వం సేకరిస్తోందనే అరోపణలు ఉన్నాయి. ఇప్పుడు చైనా మొబైళ్లు కొన్ని పదాలను ఆటోమేటిక్‌గా సెన్సార్‌షిప్ చేస్తోందని లిథుయేనియా ప్రభుత్వం ఆరోపిస్తోంది. చైనాకు చెందిన మొబైళ్లను విసిరికొట్టాలని, భవిష్యత్తులో చైనాకు చెందిన మొబైళ్లకు కొనుగోలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. చైనా మొబైళ్లను…