క్యూబాలోని మతాంజాస్ నగరంలోని చమురు నిల్వ కేంద్రంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటు వల్ల భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు 80 మంది గాయపడ్డారు. మంటలార్పేందుకు వచ్చిన 17 మంది అగ్నిమాపక సిబ్బంది అదృశ్యమయ్యారు.
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌కు సమీపంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. తమ 56వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వృద్ధ జంటతో సహా ముగ్గురు వ్యక్తులు శుక్రవారం వైట్‌హౌస్ సమీపంలోని పార్కులో పిడుగుపాటుకు గురై మరణించినట్లు అక్కడి అధికారులు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారిపోయింది.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది… అయితే, కర్నూలు జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు బలి అయ్యారు.. ఆదోని మండలం కుప్పగల్‌లో పిడుగు పడి కనిగిని ఉరుకుంధమ్మ (33), కనిగిని లక్ష్మమ్మ (39) ఇద్దరు మహిళలు మృతిచెందారు.. ఇక, హోళగొంద మండలం వండవాగిల