జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో లెంకలగడ్డ గోదావరి సమీపంలో పిడుగు పడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
Telangana Lightning Tragedy: పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల పరిధిలో ఆరుగురు పిడుగు పాటుకు బలయ్యారు. నిల్మల్ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్‌లో ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉన్నట్టుండి వాతావరణం చల్లబడిపోయింది. ఆకాశమంతా మేఘావృతమైపోయింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. అకాల వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విశాదం చోటుచేసుకుంది. పదర మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగు పడటంతో సుంకరి సైదమ్మ (35) ఈదమ్మ, (55) అక్కడికక్కడే మృతి చెందారు.…
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఆకాశంలో ఉరుములు, మెరుపులు హడలెత్తించాయి. భారీ శబ్దాలతో ఉరుములు రావడంతో జనాలు హడలెత్తిపోయారు. ఇక పిడుగుపాటుకు 38 మంది మరణించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుతో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో పిడుగు పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు
20 Killed amid unseasonal rains lash Gujarat: ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగండ్ల వర్షం పడింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ప్రాణ నష్టం కూడా జరిగింది. పిడుగులకు 20 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నేడు కూడా గుజరాత్‌లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి అకాల వర్షాలతో గుజరాత్ అతలాకుతలమైంది. గుజరాత్‌లోని…
ఒడిశాలో వర్షంతో పాటు పిడుగులు బీభత్సం సృష్టించాయి. కేంద్రపరా జిల్లాలోని ఓ పాఠశాలపై పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Telugu Girl Susroonya Koduru health Critical: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద పిడుగుపాటుకు గురై అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని వెళ్లిన భారతదేశానికి చెందిన 25 ఏళ్ల తెలుగు విద్యార్థిని సుస్రూణ్య కోడూరు తీవ్రంగా గాయపడింది. శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌లోని చెరువు వద్ద షికారు చేస్తుండగా పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. పిడుగుపాటుకు గురై సుస్రూణ్య గాయపడి పక్కనే ఉన్న ఒక చెరువులో…
Lightning Strike: ఉరుములు, పిడుగులు పడుతున్న వేళ ఎలక్ట్రానిక డివైజ్ వాడకూడదని చెబుతుంటారు. కానీ చాలా మంది ఈ సూచనలను పట్టించుకోరు. తాజాగా ఇలాగే పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లఖీంపూర్ ఖేరీలో 50 ఏళ్ల రైతు తన పొలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపాటుకు గురై మరణించాడు.
శ్చిమ బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగుల కారణంగా కనీసం 14 మంది మరణించారని అధికారులు తెలిపారు.