టీడీపీకి ఏపీ సీఈవో ఎంకే మీనా లేఖ రాశారు.. గత నెల 23వ తేదీన టీడీపీ ఇచ్చిన రిప్రజెంటేషన్‌పై తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రత్యుత్తరం రాశారు.. 2024 ఓటర్ల తుది జాబితా తయారీలో భాగంగా 2023 డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించాం. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా 2024 జనవరి 12 తేదీలోగా పరిష్కరిస్తాం అని తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 5వ తరగతి చదవుతున్న విద్యార్థిని లేఖ రాసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటూ.. అంజలి అనే విద్యార్థిని సీఎంను లేఖలో కోరింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆధిబట్లకు చెందిన విద్యార్థిని అంజలి.. “గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమష్కరించి వ్రాయునది.. సీఎంగా మీరు ఎన్నికైనందుకు శుభాకాంక్షలు. దయచేసి మా ప్రభుత్వ స్కూలుకు ఉచిత విద్యుత్ అందించాలని మనవి” అని లేఖ రాసి పోస్ట్ చేసింది. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర…
కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్ల లేమి కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో.. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కేరళ ముఖ్యమంతి పినరయి విజయన్‌కు లేఖ రాశారు. శబరిమలలో అయ్యప్పస్వాములకు కనీస సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. కాగా.. చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదన్న విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన రాజీనామాకు సంబంధించి సత్యనారాయణ ఓ లేఖ రాశారు.
ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
Chandrababu Naidu Writes Letter to ACB Court Judge: టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ రాశారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు మరియు ఆందోళన వ్యక్తం చేస్తూ.. 3 పేజీల లేఖ రాశారు. అక్టోబర్ 25న రాసిన లేఖను జైలు అధికారుల ద్వారా ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు పంపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తనను చంపాలని కొందరు కుట్ర పన్నుతున్నారంటూ లేఖలో బాబు…
జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి తన పేరును తొలగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కరణ్‌సింగ్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు.
మణిపూర్‌లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ర్యాగింగ్ నియంత్రణకు ఎంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు. దేశంలోని ఏదో ఒక విద్యా సంస్థలో ఏదో రూపంలో ర్యాగింగ్ భూతం బయటపడుతోంది.