కృష్ణపట్నం ఆనందయ్యకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాసారు. అందులో ”ఆయుర్వేదం మందుతో మీ ఖ్యాతి జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. రాజకీయాలకు అతీతంగా అందరూ మీకు అండగా నిలుస్తున్నారు. ప్రజలందరూ దేవుడిగా భావిస్తున్న మిమ్మల్ని భద్రత పేరుతో నిర్బంధించడంపై చాలా బాధపడుతున్నాం. జైలులో ఖైదీకి ఉండే స్వేచ్ఛ కూడా మీకు లేదు చాలా బాధాకరం. ప్రభుత్వం మీకు భద్రత కల్పించకపోయినా కృష్ణపట్నం ఊరంతా అండగా ఉంది..వాళ్లే మీకు రక్షణ కల్పిస్తారు. వైసీపీ నాయకులకు, అధికారులకు, వారి సన్నిహితులకు…
తెలంగాణ సిఎం కెసిఆర్ కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. తన అరెస్ట్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ పోలీసులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధిని అరెస్ట్ చేసే సమయంలో పొరుగు రాష్ట్ర పోలీసులు అనుసంచాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలను గచ్చిబౌలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) పట్టించుకోలేదని వెల్లడించారు. అరెస్టు చేసే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించాలన్న నిబంధనను కూడా పట్టించుకోలేదన్నారు. ఆ…
సీఎం జగన్ మోహన్ రెడ్డికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేఖ రాసారు. కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ను 25 లక్షలకు పెంచాలి. ఆధారం కోసం కోవిడ్ పాజిటివ్ టెస్టునే కాకుండా, డెత్ సర్టిఫికెట్ ను కూడా అంగీకరించాలి . అనాధలుగా మారిన పిల్లలకు ఉపశమనం కోసం తక్షణమే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్ వరకూ పిల్లల…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం కారణంగా వాయిదా పడ్డ పరీక్షలను తిరిగి నిర్వహిచేందుకే సిద్ధమవుతోంది సీబీఎస్ఈ బోర్డు.. అయితే పరీక్షల పాటర్న్ కరోనా సంక్షోభం నేపధ్యంలో కాస్త మారనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు విధివిధానాల్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.. అయితే, సీబీఎస్ఈ పరీక్షలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 297 మంది విద్యార్థులు… పరీక్షలు భౌతికంగా నిర్వహించాలని తీసుకున్ననిర్ణయాన్ని క్వాష్ చేయాలని విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల మూల్యాంకనంకి గతేడాది అవలంభించిన ప్రత్యామ్నాయ విధానాలను అవలంభించాలి.. ఈ…
కరోనా విపత్తుతో ప్రజలు చితికిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్సను చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కి వినతిపత్రం సమర్పించారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. అందులో ”కరోనాను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలమైంది. ఫలితంగా ఈ వ్యాధి విస్తరిస్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చకపోవడంతో గ్రామీణులు ముఖ్యంగా పేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో వైద్య వసతులు పెంచడంలో టీఆర్ఎస్…
కరోనా వాక్సినేషన్ పై ప్రధాని మోడీకి లేఖ రాయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానికి వాక్సిన్ డోసుల ను త్వరగా కేటాయించాలని లేఖ రాయనున్నారు సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్ లో ప్రాధాన్యం ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. కర్ణాటక, ఒరిస్సా, తమిళనాడు నుండి రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే రేపటి నుండి…