ప్రభుత్వాలు ఎన్ని అటవీ, వన్యప్రాణుల సంరక్షణ చట్టాలను తీసుకువచ్చినా వన్యప్రాణులను వేటగాళ్ల భారీ నుంచి ఎవ్వరూ తప్పించలేకపోతున్నారు. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వేటగాళ్లు మాత్రం తమ దారిలోనే అధికారుల కళ్లు గప్పి గుట్టు చప్పుడు కాకుండా పని కానిచ్చేస్తున్నారు. దీంతో వన్యప్రాణుల సంరక్షణపై తీసుకునే రక్షణ చర్యలపై ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే వేటగాళ్ల కారణంగా ఎన్నో వన్యప్రాణి జాతులు చివరి దశకు చేరుకున్నాయి. ఉన్న కొన్నింటినైనా కాపాడుకుని భవిష్యత్ తరాలకు వాటిని పుస్తకాల్లో కాకుండా నిజంగానే చూపించాలంటే వేటగాళ్లపై ఉక్కుపాదం మోపక తప్పదు.
తాజాగా నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్లో అటవీ ప్రాంతంలో యథేచ్చగా వన్యప్రాణులను వేటాడుతున్నారు వేటగాళ్లు. ఓ చిరుతను చంపి, గోర్లు దంతాలు తీసిన దుండగులు అనంతరం చిరుతను కాల్చేసిన ముగ్గురు నిందితులు. అమ్రాబాద్ మండలం మల్లెలతీర్థం వద్ద ఉచ్చులో పడి చిరుత చనిపోయిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. 18గోర్లు, 4 దంతాలు తీసి చిరుతను దహనం చేసినట్టు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఫారెస్టు అధికారులు. నారాయణ పేట జిల్లాలోనూ రెండు నెలల కిందట ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు, పోలీసులు వేటగాళ్ల పని చెప్పకపోతే ఇలాంటి ఘటనలు మళ్లీ పునారావృతం అయ్యే అవకాశం ఉంది.