శాసన మండలి నుంచి మళ్లీ మళ్లీ వాకౌట్ చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.. శాసన మండలిలో వైసీపీ ఇచ్చిన ఇసుక కొరత, భవన కార్మికుల కష్టాలపై వాయిదా తీర్మానం, అగ్రిగోల్డ్ బాధితులపై పీడీఎఫ్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్.
అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి.. మండలిలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. అసెంబ్లీ ముందు ఉన్న ముళ్ల కంచెలు తొలగించే విషయమై అన్ని పార్టీలతో సమావేశం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ అంశాలు.. అసెంబ్లీ, మండలి వ్యవహారాలు చైర్మన్, స్పీకర్ పరిధిలో ఉంటాయి.. మీరు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను మేడిగడ్డ పర్యటనను తీసుకు వెళ్తానని రేవంత్…
శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం పాలన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. మేము ప్రజాస్వామిక పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా.. అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.
శాసన మండలిలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు నెహ్రూ, కేసీఆర్, సోనియా గాంధీ అని అన్నారు. కేసీఆర్ జనాల గుండెల్లో నిలిచి పోయారని తెలిపారు. వందల ఎకరాలు ఉన్న వాళ్లకు హీరోలకు, హీరోయిన్లకు, ఐఏఎస్ లకు, ఐపీఎస్ లకు రైతు బంధు వద్దని అప్పుడు చెప్పాను.. ఇప్పుడు చెపుతున్నా అని గోరేటి వెంకన్న పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంను అధికారులు బ్లేమ్ చేశారు.. 317 జీవోను తీసుకువచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వంను బదానం…
గత ప్రభుత్వం లేఖలకే పరిమితం అయింది అంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది కమిషన్ ప్రాజెక్ట్.. మిషన్ భగీరథ తో జనాలకు ఒరిగింది ఏమి లేదు.. అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ప్రపంచ స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు (టిమ్స్) 2023తో సహా ఐదు ముఖ్యమైన బిల్లులను శాసన మండలి ఆదివారం ఆమోదించింది. తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బిల్లు (టిమ్స్), 2023, తెలంగాణ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు, 2023ని ఆరోగ్య, ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్…
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ బలపరచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. సమీప పీఆర్‌టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 9 స్థానాలకు 139 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు తలపడ్డారు.
తెలుగు రాష్ట్రాల్లో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.