AP Legislative Council: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ.. కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి.. రమేష్ యాదవ్.. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు మంత్రులు.. అయితే, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదని…
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు బీఆర్‌ఎస్‌కు బూస్ట్ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్. అయితే…ఈ మూడు నెలల్లోపు…
Minister Seethakka: శాసన మండలిలో పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ సవరణ-2025 బిల్లుపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.
కౌన్సిల్ ఆవరణలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన తెలిపారు. మెడలో మిర్చి దండలు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని రూ. 25వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2లక్షల 40 వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. Also Read:Ponnam Prabhakar:…
మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారు.. దీని గుర్తించి తమ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారు. మండలి చైర్మన్‌గా న్యూసెన్స్ అనే పదం వాడారు.. దాన్ని రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
తెలంగాణ శాసన సభ, మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. మండలి ప్రారంభమైన కాసేపటికే శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించాలని.. పసుపు రైతులను వెంటనే ఆదుకోవాలి అంటూ నిరసన చేపట్టారు.
MLC Nominations: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు నేడు (సోమవారం) చివరి రోజు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సంస్థ లెక్కలపై ఆడిట్ నివేదికను మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఏపీ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ వార్షిక ఆడిట్ నివేదికలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అలానే సాధారణ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మండలిలో…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించి అఖండ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఈ విజయం తెలంగాణ సమాజానికి, ఉపాధ్యాయులకు అంకితం ఇస్తున్నాం. రెండు ఎమ్మెల్సీలు ఏక కాలంలో రావడం చాలా సంతోషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీని ఆదరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన…
శాసన మండలిలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదాపై పార్లమెంట్, అసెంబ్లీ నియమ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు.