AP High Court: మావోయిస్టు నాయకులు దేవజీ, మల్లా రాజిరెడ్డి కోర్టులో హాజరుపర్చాల్సిందిగా కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషనర్లు చేసిన అభ్యర్థనపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court: పోక్సో(POCSO) కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఒక అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకునన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసుల్ని రద్దు చేసింది.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు విచారణను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో (జనరల్ ఆర్డర్) 42 శాతం బీసీ రిజర్వేషన్లను కలుపుతూ వివాదాస్పదంగా ఉంది.
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. ఆయనకే కాదు ఆయన కొడుకు మంచు విష్ణుకు కూడా ఊరట లభించింది. ఈ మధ్య ఈ విషయం వచ్చినా మంచి వ్యవహారాలు వివాదస్పదంగా మారుతున్నాయి.. అయితే వీళ్ళకి లభించిన ఊరట మాత్రం 2019లోని ఎన్నికల కోడ్ కేసులో… ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఉన్న తమ విద్యా సంస్థలోని విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2019లో సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచి…
అత్త తన కోడలిపై గృహ హింస కేసు పెట్టవచ్చా? అలహాబాద్ హైకోర్టులో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. అలహాబాద్ హైకోర్టులో ఓ అత్త తన కోడలు గృహ హింసకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. తాజాగా కోర్టులో ఈ కేసుపై విచారణ జరిగింది. విచారణ సమయంలో.. అత్తగారు తన కోడలిపై ఇలాంటి కేసు పెట్టవచ్చా? అనే ప్రశ్న తలెత్తింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గరిమా తన కోడలితో పాటు 5 గురు కుటుంబీకులపై ఈ ఫిర్యాదు చేసింది.
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం గడువు ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వక్ఫ్ బోర్డులో కొత్త నియామకాలు చేయొద్దని ఆదేశించింది. వారం రోజుల్లో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలపై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి మార్పు చేయవద్దని.. వక్ఫ్ ,వక్ఫ్ బై యూజర్ ఆస్తులను డీ నోటిఫై…
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలు రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.. గత ఫిబ్రవరి ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు…
బెట్టింగ్ యాప్ కేసులో నేడు పంజాగుట్ట పోలీసుల ముందుకు నటి విష్ణు ప్రియ మరోసారి రానుంది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే పంజాగుట్ట పోలీసులు చెప్పారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. హైకోర్టులో విష్ణుప్రియకు చుక్కెదురైంది. విచారణకు సహకరించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇవాళ పంజాగుట్ట పోలీసుల ముందుకు విచారణకు విష్ణు ప్రియ హాజరుకానుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కీలక ములుపు చోటు చేసుకుంది. దర్యాప్తు బృందం ఈ కేసులోని ఆరు నిందితుడికి నోటీసులు జారీ చేసింది. ఇవాళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణ హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. పోలీసులు ఈనెల 26న శ్రావణ్ రావు కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేశారు. మూడు రోజుల సమయం తర్వాత విచారణకు హాజరు కావాలని తెలిపారు.